Saturday, April 1, 2023
More
  HomelatestKCR పాలనలో తెలంగాణలో ధాన్యరాశులు.. మోడీ పాలనలో దేశంలో ఆకలి కేకలు

  KCR పాలనలో తెలంగాణలో ధాన్యరాశులు.. మోడీ పాలనలో దేశంలో ఆకలి కేకలు

  • హాలియా మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారంలో మంత్రి జగదీష్ రెడ్డి

  విధాత: సీఎం కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ధాన్యం రాశులతో అన్నపూర్ణగా మారగా, ప్రధాని మోడీ పాలనలో దేశంలో ఆకలి కేకలు సంభవిస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. హాలియా మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

  మార్కెట్ చైర్మన్‌గా జవ్వాజి వెంకటేశం, వైస్ చైర్మన్‌గా ఆడపు రామలింగయ్యతో పాటు నూతన డైరెక్టర్లు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన పాలక మండలి సభ్యులను మంత్రి జగదీష్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు.

  తెలంగాణ ఏర్పాటు సందర్భంలో శాపనార్ధాలు పెట్టిన వారే నేడు సీఎం కేసీఆర్ పరిపాలన కోరుకుంటు న్నారన్నారు. 2014 కు ముందు వ్యవసాయ రంగం ఎలా ఉందో ఇపుడు ఎలా ఉందో రైతు సోదరులు ఆలోచించాలని కోరారు. తెలంగాణ తరహా పథకాలు దేశంలో మరెక్కడా లేవన్న మంత్రి కేసీఆర్ పాలన కోసం పక్కన ఉన్న ఆంధ్ర ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.

  కార్నర్ మీటింగ్ లు పెట్టీ బిజెపి నేతలు చెబుతున్నవి పచ్చి అబద్ధాలు అని మండిపడ్డారు. మూల మీటింగ్‌లకు వస్తున్న కేంద్ర మంత్రులకు దమ్ముంటే వారి ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు ఉన్న ప్రజాభిమానం ముందు ఈ.డి లు బొడీలు పనికిరావని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

  ఒకరిద్దరి అభివృద్ధి కోసమే మోడీ పాలన అన్న మంత్రి.. మోడీ పాలనలోనీ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా మన పథకాలు అయిన ఆసరా పెన్షన్, 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు లేవని అన్నారు. తెలంగాణ పల్లెలో ఉన్న పరిస్థితి బిజెపి మంత్రులు తమ గ్రామాల్లో ఉందో చెప్పాలని ప్రజలు కూడా వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు.

  బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ 24 గంటలు ఉచిత విద్యుత్ అమలు కావడం లేదన్నారు. చైతన్య వంతులైన తెలంగాణ సమాజం ముందు బిజెపి పాచికలు పారవని మంత్రి అన్నారు. బిజెపి పని కూల గొట్టుడు అయితే కేసీఆర్ పని నిలబెట్టడమే అన్నారు.

  ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్టానికి కేసీఆర్ ఏమి చేసిండో, మోడీ ప్రధాని అయిన తరువాత దేశానికి ఏమి చేసిండో ప్రజలు గుర్తించారని తెలిపారు. గుడికి మసీద్‌లకు పంచాయితీ పెట్టీ 30ఏళ్లుగా బతుకుంది బిజెపి అయితే , అన్ని వర్గాల ప్రజలు సుఖంగా ఉంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మే నాయకుడు కేసీఆర్ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

  తెలంగాణ తరహా పథకాల కోసం దేశ ప్రజల నుండి వస్తున్న డిమాండ్లతోనే కేసీఆర్‌పై మోడీ కక్ష్య సాధింపు మొదలైంది అన్నారు. సందర్బం ఏదయినా కేసీఆర్‌కు తెలంగాణ సమాజం అండగా నిలవాలి అని మంత్రి పిలుపు నిచ్చారు.

  18 ఏళ్లు మంత్రి అని చెప్పుకున్న జానారెడ్డి వంటి నాయకుల హయాంలో సాగర్ నియోజకవర్గానికి ఇక్కడి ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్నారు. 35 ఏండ్ల శాసనసభ్యుడునని, 18 ఏళ్ల మంత్రినని చెప్పుకునే జానారెడ్డి సాగర్ ప్రజలకు రాజవరం మేజర్ నీళ్లు ఎందుకు ఇవ్వలేదు అన్నారు.

  పెద్ద నాయకుడినని అని చెప్పుకునే జానారెడ్డి హయాంలో నాగార్జున సాగర్ దాహం కేకలతో విల విల లాడిందన్నారు. 2014 తరువాత సాగర్‌లో అభివృద్ధిని పరిచయం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని, అప్పటి శాసన సభ్యులు నోముల నరసింహయ్యదే అన్నారు.

  కార్య్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్ , జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు,పిఎసిఎస్ జిల్లా డైరెక్టర్ విరిగినేని అంజయ్య, జడ్పీటీసీ అబ్బీడి కృష్ణా రెడ్డి, ఎంపీపీ బొల్లం జయమ్మ, మున్సిపల్ చైర్మన్లు వెంపటి పార్వతమ్మ శంకరయ్య, కర్ణ అనూష శరత్ రెడ్డి, నిడమానూరు మార్కెట్ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, ఎడమకాల్వ మాజీ వైస్ చైర్మన్ మలిగిరెడ్డి లింగారెడ్డి,

  పిఎసిఎస్ చైర్మన్ గుంటుక వెంకటరెడ్డి, ఎంఆర్ఓ మంగా, మండల అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, జాటావత్ రవి నాయక్,తాటి సత్యపాల్,పట్టణ అధ్యక్షులు చెరుపల్లి ముత్యాలు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ఎంపీటీసీలు,సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, వివిధ హోదాల్లో వున్న నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళ నాయకులు, రైతు సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  spot_img
  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular