విధాత: గ్రంథాలయ ఉద్యమానికి నల్గొండ జిల్లా కేంద్ర బిందువుగా నిలిచి ప్రజా చైతన్యంలో కీలక భూమిక పోషించిందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అన్నారు. గురువారం ఆయన జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న నల్గొండ మోడల్ గ్రంథాలయ భవన నమూనా ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. వట్టికోట ఆల్వార్ స్వామి వారసత్వంతో గ్రామ గ్రామాన గ్రంథాలయాల ఏర్పాటు, అభివృద్ధిలో నల్గొండ జిల్లా ముందంజలో ఉందన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలు […]

విధాత: గ్రంథాలయ ఉద్యమానికి నల్గొండ జిల్లా కేంద్ర బిందువుగా నిలిచి ప్రజా చైతన్యంలో కీలక భూమిక పోషించిందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అన్నారు. గురువారం ఆయన జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న నల్గొండ మోడల్ గ్రంథాలయ భవన నమూనా ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.

వట్టికోట ఆల్వార్ స్వామి వారసత్వంతో గ్రామ గ్రామాన గ్రంథాలయాల ఏర్పాటు, అభివృద్ధిలో నల్గొండ జిల్లా ముందంజలో ఉందన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలు దృష్టిలో ఉంచుకొని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు . ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో రాష్ట్రంలో నూతన గ్రంథాలయ భవనాలు రూపుదిద్దుకున్నాయన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రంథాల‌యాల అభివృద్ధికి మంత్రి జగదీష్ రెడ్డి సహకారం మరువలేనిది అన్నారు. నల్గొండ జిల్లాలో పదివేల సభ్యత్వాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ‌ సంస్థ చైర్మన్ రేగట్ట మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. గ్రంథాలయాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడమే కాకుండా పోటీ పరీక్షలకు అనుగుణంగా నూతన పుస్తకాల కొనుగోలు చేసి గ్రంథాలయాలకు సరఫరా చేస్తున్నామన్నారు.

గ్రంథాలయాల‌ ఆధునీకరణను ముందుకు నడిపిస్తున్న నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్‌ను జిల్లా గ్రంథాల‌యాల సంస్థ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ, సిబ్బంది కట్టా నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated On 29 Dec 2022 2:09 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story