Wednesday, December 7, 2022
More
    Homelatestభారత్‌ జోడో యాత్రకు రాష్ట్రంలో విశేష స్పందన: రేవంత్‌రెడ్డి

    భారత్‌ జోడో యాత్రకు రాష్ట్రంలో విశేష స్పందన: రేవంత్‌రెడ్డి

    విధాత: భారత్‌ జోడో యాత్రకు రాష్ట్రంలో విశేష స్పందన లభిస్తున్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. రాహుల్‌ గాంధీకి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్‌లో కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జోడో యాత్ర రాష్ట్రానికి వచ్చినప్పటికీ యాత్రను విజయవంతం చేయడానికి నాయకులు ఎంతో కృషి చేశారని కొనియాడారు.

    ఈ నెల 5, 6వ తేదీల్లో పాదయాత్ర కొనసాగుతుందని 7వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని, మొత్తం తెలంగాణలో రాహుల్‌గాంధీ 15 రోజుల పర్యటన సారాంశాన్ని, ప్రజల నుంచి వారికి వచ్చిన విజ్ఞప్తులను, రాహుల్‌ గాంధీ తన ఆలోచనలను, తన అనుభవాలను ఆ వేదిక ద్వారా పంచుకుంటారని తెలిపారు. కాబట్టి వీడ్కోలు సమావేశం అద్భుతంగా నిర్వహించాలని సూచించారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page