- సమస్యలు పరిష్కరించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
విధాత, మెదక్ బ్యూరో: ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం కోసం ప్రతి నెల 2, 16 తేదీల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి (MLA Padma Devender Reddy) అధికారులతో కలిసి క్యాంపు కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రోజు నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
నియోజకవర్గంలోని మెదక్, పాపన్నపేట, రామాయంపేట, నిజాంపేట,శంకరంపేట ఆర్ ,హవేలీఘనాపూర్ మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే కు సమస్యలను విన్నవించుకున్నారు. పింఛన్లు, డబల్ బెడ్ రూమ్, రెవెన్యూ కు సంబంధించిన సమస్యలు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అర్హులైన అందరికీ డబుల్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
మెదక్ మండలం మక్ధూంపూర్ గ్రామంలో కరెంట్ సమస్య చాలా ఉందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు,ఆ గ్రామానికి ర్యాలమడుగు సబ్ స్టేషన్ నుండి త్రీఫేస్ ఇస్తున్నారు అని,సింగిల్ ఫేస్ కుంచనపల్లి సబ్ స్టేషన్ నుండి ఇస్తున్నారని తెలియజేశారు. ఈ విధంగా ఇవ్వడం వల్ల పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు.
లైన్మెన్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే ద్రుష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి గ్రామ సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. మిగతా సమస్యలను అక్కడే ఉన్న అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. అందుబాటులో లేని అధికారులకు ఫోన్ ద్వారా సమస్య లను వివరించి పరిష్కార దిశగా కృషి చేశారు.
అదేవిధంగా హవేళిఘనాపూర్ మండలం బూర్గుపల్లి గ్రామ సర్పంచ్ చెన్నా గౌడ్ వారి గ్రామానికి నర్సరీ కోసం స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు, వారి గ్రామంలో క్రీడా ప్రాంగణం పక్కన ఒక ఐదు గంటలు స్థలం ఇప్పించాలని ఎమ్మెల్యేని కోరారు, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మెదక్
డిఎఫ్‌ఓతో ఫోన్లో మాట్లాడి క్రీడా ప్రాంగణం పక్కన స్థలం పరిశీలించి నర్సరీకి స్థలం కేటాయించాలని డి.ఎఫ్.ఓ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్,జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్య రెడ్డి,ఆత్మ కమిటీ చైర్మన్ అంజ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు భీమరి కిషోర్,జయరాజ్, ఆర్కే శ్రీనివాస్,మెదక్ ఎంపీపీ యమునా జయరాం రెడ్డి, రైతుబంధు అధ్యక్షులు కిష్టయ్య, హవేళిఘనాపూర్ మండలం జడ్పిటిసి సిహెచ్. సుజాత శ్రీనివాస్, ఎమ్మార్వో నవీన్,మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.