- కాపురానికి ససేమిరా అన్న వధువు,.. వరుడిపై కేసు నమోదు
First Night Video| విధాత: యువత అత్యుత్సాహానికి పోతోంది. ఎప్పుడు ఏమి చేయూలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఫోన్ ఉంది. దాన్ని ఎలా వాడాలో తెలియని స్థితికి చేరారు. దేన్నీ షూట్ చేయాలి, దేన్నీ చేయకూడదు, దేన్నీ జనాలకు చూపాలి, దేన్నీ ప్రయివేట్‌గా ఉంచాలన్న సోయి కొరవడుతోంది. చివరకు ఓ నవ వరుడు శోభనం రాత్రి ఏర్పాట్లను సోషల్ మీడియాలో పెట్టి పెళ్లిని పెటాకులు చేసుకున్నాడు. చివరకు పోలీస్ కేసు కూడా ఐంది.
ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామంలో ఇటీవల యువకుడు (20), బాలిక(17) వివాహం జరిగింది. కలిసి కాపురం చేస్తామని ప్రమాణం చేసిన భర్తే ఆమె అత్మ గౌరవం దెబ్బతినేలా చేశాడు. సభ్య సమాజం సిగ్గుపడేలా కట్టుకున్న భార్యతో ఫస్ట్ నైట్ గడిపిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో విషయం తెలిసిన భార్య.. భర్తను ఛీకొట్టి పుట్టింటికి వెళ్లి.. తల్లి దండ్రుల సహాయంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాస్తవంగా వివాహం తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆ భర్త తన భార్యతో గడిపిన క్షణాలు ఫొటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. భార్యకు తెలియకుండా ఆ భర్త సోషల్ మీడియాలో ఫొటోలు మరియు వీడియోలు షేర్ చేయడం.. అవి కాస్త వైరల్ అవ్వడంతో తన భర్త చేసిన పనికి ఆగ్రహించి, అలిగి భార్య పుట్టింటికి వెళ్లింది. ఆ యువతి కుటుంబ సభ్యులు ఆ యువకుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి సోషల్ మీడియా నుంచి ఆ ఫొటోలను తొలగించడంతో పాటు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అంతే కాకుండా అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దంపతులను కలిపేందుకు పెద్ద మనుషులు ప్రయత్నించారు. కానీ ఆ యువతి మాత్రం అతడితో కలిసి ఉండేందుకు ససేమిరా అంటోంది కొత్త పెళ్లి కొడుకు అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫస్ట్ నైట్ ఫొటోలు మొత్తం సంసారాన్ని.. జీవితాన్ని నాశనం చేశాయి. పైగా కుర్రాడి మీద పోలీస్ కేసు కూడా బుక్ అయింది