Marriage | నూతన వరుడు (Bride groom) వధువు (Bride) ఇంటికి వెళ్లాలంటే.. అత్తింటి వారు కనీసం ఓ కారును సిద్ధం చేస్తారు. కానీ డ్రైవర్ల నిరసన (Drivers Strike) కారణంగా ఓ వరుడు అర్ధరాత్రి సమయంలో 28 కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చింది. వరుడితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా వధువు ఇంటికి నడిచి వెళ్లారు. ఈ ఘటన ఒడిశా (Odisha)లోని రాయగడ జిల్లా (Rayagada Dist)లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాయగడ జిల్లాలోని కళ్యాణ్‌సింగ్‌పూర్ బ్లాక్ పరిధిలోని సునఖండి పంచాయతీకి చెందిన ఓ యువకుడికి.. దిబాలపాడు గ్రామానికి చెందిన యువతితో వివాహం (Marriage) నిశ్చయమైంది. అయితే వీరి పెళ్లి శుక్రవారం ఉదయం జరగాల్సి ఉంది. దీంతో గురువారం రాత్రి వరుడు వధువు ఇంటికి వెళ్లాలి. కానీ వధువు కుటుంబ సభ్యులు వరుడి ఇంటికి కారును పంపలేదు. డ్రైవర్ల నిరసన కారణంగా కార్లు అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలా? అని వధువు కుటుంబ సభ్యులు ఆలోచనలో పడ్డారు.
Marriage | తెల్లారితే పెళ్లి.. అర్ధరాత్రి 28 కి.మీ. నడిచి వధువు ఇంటికెళ్లిన వరుడు | Vidhaatha | Latest Telugu News https://t.co/tOLOJALmQ0 #viral pic.twitter.com/44WiAJyaiq
— vidhaathanews (@vidhaathanews) March 18, 2023
ఇక ముహుర్త సమయానికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వరుడు.. తన గ్రామం నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న వధువు ఇంటికి గురువారం అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్లాడు. వరుడితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా కాలి నడకనే వధువు ఇంటికి వెళ్లారు.ఇక అనుకున్న ముహూర్తానికే వారి వివాహం జరిగింది. వరుడు, అతని కుటుంబ సభ్యులు కలిసి వధువు ఇంటికి నడుచుకుంటూ వెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
View this post on Instagram