విధాత: తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక 'కీ'ని గడువులోగా ప్రకటించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. పరీక్ష నిర్వహించిన ఎనిమిది పని దినాల్లో కీ విడుదలతో పాటు ఓఎంఆర్ పత్రాల ఇమేజ్ స్కానింగ్ పూర్తి చేస్తామని కమిషన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే కీ వెలువడనున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగిన విషయం విదితమే. […]

విధాత: తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక 'కీ'ని గడువులోగా ప్రకటించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. పరీక్ష నిర్వహించిన ఎనిమిది పని దినాల్లో కీ విడుదలతో పాటు ఓఎంఆర్ పత్రాల ఇమేజ్ స్కానింగ్ పూర్తి చేస్తామని కమిషన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో ఈ వారంలోనే కీ వెలువడనున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగిన విషయం విదితమే. ఈ పత్రాలన్నీ జిల్లాల నుంచి సోమవారానికి హైదరాబాద్ కు చేరుకున్నాయి.

మంగళవారం నుంచి ఓఎంఆర్ పత్రాల ఇమేజ్ స్కానింగ్ ప్రారంభమైంది. పండగ సెలవుల్ని మినహాయించగా, మొదట చెప్పినట్లు 8 పనిదినాల్లో ప్రక్రియ పూర్తి చేయనున్నది. ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి గడువులోగా అభ్యంతరాలు స్వీకరించి, తుది కీ విడుదల చేయనున్నది.

Updated On 24 Oct 2022 12:25 AM GMT
krs

krs

Next Story