Group-1 | ఈ నెల 11వ తేదీన టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించ‌బోయే గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను వాయిదా వేసేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాక‌రించింది. గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని దాఖ‌లైన నాలుగు పిటిష‌న్ల‌ను కోర్ట కొట్టేసింది. దీంతో ఈ నెల 11వ తేదీన గ్రూప్ - ప్రిలిమ్స్ య‌ధావిధిగా జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప్రిలిమిన‌రీ ఎగ్జామ్‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను అధికారులు పూర్తి చేశారు. నిన్న‌టి నుంచి హాల్ టికెట్ల‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 11వ తేదీన […]

Group-1 | ఈ నెల 11వ తేదీన టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించ‌బోయే గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను వాయిదా వేసేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాక‌రించింది. గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను వాయిదా వేయాల‌ని దాఖ‌లైన నాలుగు పిటిష‌న్ల‌ను కోర్ట కొట్టేసింది. దీంతో ఈ నెల 11వ తేదీన గ్రూప్ - ప్రిలిమ్స్ య‌ధావిధిగా జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప్రిలిమిన‌రీ ఎగ్జామ్‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను అధికారులు పూర్తి చేశారు. నిన్న‌టి నుంచి హాల్ టికెట్ల‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

11వ తేదీన ఉద‌యం 10:30 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష కేంద్రాల‌కు అభ్య‌ర్థుల‌కు గంట ముందే చేరుకోవాల‌ని సూచించారు. ప‌రీక్ష ప్రారంభానికి ముందు ఉద‌యం 10:15 గంట‌ల‌కే గేట్లు మూసివేస్తామ‌ని, ఆ త‌ర్వాత వ‌చ్చే అభ్య‌ర్థుల‌ను ప‌రీక్షా కేంద్రంలోకి అనుమ‌తించ‌బోమ‌ని టీఎస్‌పీఎస్సీ అధికారులు హాల్‌టికెట్ల‌లో స్ప‌ష్టంగా పేర్కొన్నారు.

ఇక ఓఎంఆర్ షీట్ల‌లో వ్య‌క్తిగ‌త వివ‌రాలు, స‌మాధానాల‌ను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో స‌క్ర‌మంగా బ‌బ్లింగ్ చేయాల‌ని సూచించారు. స‌రైన వివ‌రాలు బబ్లింగ్ చేయని, పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్ ఉప‌యోగించిన‌, డ‌బుల్ బ‌బ్లింగ్ చేసిన ప‌త్రాలు చెల్లుబాటుకావు అని స్ప‌ష్టం చేశారు. అభ్య‌ర్థులు హాల్ టికెట్‌తో పాటు ఆధార్, పాన్ కార్డు వంటి గుర్తింపు కార్డులు తీసుకు రావాల‌ని ఆదేశించారు.

503 గ్రూప్ 1 ఉద్యోగాల భ‌ర్తీకి 2022, ఏప్రిల్ 26 నోటిఫికేష‌న్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించి ప్రిలిమిన‌రీ రాత‌ప‌రీక్ష‌ను గ‌తేడాది అక్టోబ‌ర్ 16వ తేదీ నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత టీఎస్‌పీఎస్సీ నిర్వ‌హించిన ప‌లు రాత‌ప‌రీక్ష‌ల ప్ర‌శ్న‌ప‌త్రాలు లీకైన నేప‌థ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ కూడా ర‌ద్దు చేశారు. దీంతో గ్రూప్-1కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న 3,80,202 మంది అభ్య‌ర్థుల‌కు మ‌ళ్లీ రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నారు.

Updated On 5 Jun 2023 1:20 PM GMT
subbareddy

subbareddy

Next Story