విధాత: తెలంగాణలో అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష ప్రిలిమినరీ కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. కీతో పాటు ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో https://websitenew.tspsc.gov.in/అందుబాటులో ఉంచింది. సర్వీస్ కమిషన్ విడుదల చేసిన కీపై అభ్యంతరాలుంటే అభ్యర్థులు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 లోగా ఆన్ లైన్ ద్వారా తెలియజేయ వచ్చని పేర్కొన్నది. ఈ-మెయిల్స్/ రాత పూర్వకంగా లేదా ఇతర మార్గాల్లో అభ్యంతరాలను సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోమని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థులు అభ్యంతరాలతో పాటు […]

విధాత: తెలంగాణలో అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష ప్రిలిమినరీ కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. కీతో పాటు ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో https://websitenew.tspsc.gov.in/అందుబాటులో ఉంచింది.

సర్వీస్ కమిషన్ విడుదల చేసిన కీపై అభ్యంతరాలుంటే అభ్యర్థులు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 లోగా ఆన్ లైన్ ద్వారా తెలియజేయ వచ్చని పేర్కొన్నది. ఈ-మెయిల్స్/ రాత పూర్వకంగా లేదా ఇతర మార్గాల్లో అభ్యంతరాలను సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోమని కమిషన్ స్పష్టం చేసింది.

అభ్యర్థులు అభ్యంతరాలతో పాటు సరైన సమాధానానికి సంబంధించిన రుజువులు లేదా రిసోర్సు కాపీలను పీడీఎఫ్ రూపంలో జత చేయాలని సూచించింది. ఓఎంఆర్ జవాబు పత్రాలు నవంబర్ 29 వరకు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Updated On 29 Oct 2022 6:08 PM GMT
krs

krs

Next Story