మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌లో 2,701  రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో 2077 పంచాయ‌తీరాజ్‌, రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో 1245 పోస్టులు Group -4 Notification | తెలంగాణ‌లోని నిరుద్యోగుల‌కు రాష్ట్ర న్యూ ఇయ‌ర్ కానుక అందించింది. ఆ ఒక్క నోటిఫికేష‌న్ కోసం వేల మంది నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నుంచి మొద‌లుకొని ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు మున్సిప‌ల్ మంత్రి కేటీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో ఆ నోటిఫికేష‌న్ గురించి వంద‌ల సార్లు చెప్పారు. […]

  • మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌లో 2,701
  • రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో 2077
  • పంచాయ‌తీరాజ్‌, రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో 1245 పోస్టులు

Group -4 Notification | తెలంగాణ‌లోని నిరుద్యోగుల‌కు రాష్ట్ర న్యూ ఇయ‌ర్ కానుక అందించింది. ఆ ఒక్క నోటిఫికేష‌న్ కోసం వేల మంది నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నుంచి మొద‌లుకొని ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు మున్సిప‌ల్ మంత్రి కేటీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో ఆ నోటిఫికేష‌న్ గురించి వంద‌ల సార్లు చెప్పారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ సాక్షాత్తూ అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. మొత్తానికి ఆ నోటిఫికేష‌న్ విడుదలైంది. అదే గ్రూప్-4 నోటిఫికేష‌న్.

ఇక ఇప్పుడు గ్రూప్-4 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 25 విభాగాల్లో పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో నిరుద్యోగుల చ‌ర్చ అంతా ఆ నోటిఫికేష‌న్ పైనే జ‌రుగుతుంది. వంద‌ల ఉద్యోగాలు కాదు.. ఏకంగా 9,168 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. దీంతో జాబ్ కొట్టాల‌న్న ల‌క్ష్యంతో ఉద్యోగార్థులు ప్రిప‌రేష‌న్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే 9,168 ఉద్యోగాలను ప‌రిశీలిస్తే ఓ మూడు శాఖ‌ల్లోనే 6,023 పోస్టులు ఉన్నాయి.

ఆ శాఖ‌లు ఏంటంటే.. మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌లో 2,701 పోస్టులు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో 2077, పంచాయ‌తీరాజ్‌, రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగంలో 1245 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. త‌ర్వాత ఉన్న‌త విద్యా విభాగంలో 742 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌లో 474, బీసీ వెల్ఫేర్‌లో 307 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. 25 విభాగాల్లోని జూనియ‌ర్ అసిస్టెంట్, జూనియ‌ర్ అకౌంటెంట్, జూనియ‌ర్ అడిట‌ర్, వార్డ్ ఆఫీస‌ర్ వంటి పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

డిసెంబ‌ర్ 23 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

గ్రూప్ - 4 నోటిఫికేష‌న్‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నుంది టీఎస్‌పీఎస్సీ. డిసెంబ‌ర్ 23 నుంచి జ‌న‌వ‌రి 12వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెల‌లో ఎగ్జామ్ నిర్వ‌హించ‌నున్న‌ట్టు అధికారులు పేర్కొన్నారు.

Updated On 1 Dec 2022 2:50 PM GMT
subbareddy

subbareddy

Next Story