10వేల మంది రోడ్డున ప‌డే అవ‌కాశం ‘సాఫ్ట్’ రంగానికి ఇక గ‌డ్డు కాల‌మేన‌ని అంటున్న‌ ఆర్థిక‌వేత్త‌లు విధాత‌: దేశ దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఛాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న వేళ‌.. టెక్ దిగ్గ‌జ కంపెనీ గూగుల్ లే ఆఫ్ ప్ర‌క‌టిస్తున్న‌ద‌న్న వార్త‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. గూగుల్ కంపెనీకి అనుబంధ కంపెనీగా ఉన్న ఆల్ఫాబెట్‌లో 6% ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అంటే దాదాపు ప‌ది వేల మంది రోడ్డున ప‌డ‌బోతున్నార‌ని తెలుస్తున్న‌ది. అయితే ఈ వార్త‌ల‌ను గూగుల్ […]

  • 10వేల మంది రోడ్డున ప‌డే అవ‌కాశం
  • ‘సాఫ్ట్’ రంగానికి ఇక గ‌డ్డు కాల‌మేన‌ని అంటున్న‌ ఆర్థిక‌వేత్త‌లు

విధాత‌: దేశ దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఛాయ‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న వేళ‌.. టెక్ దిగ్గ‌జ కంపెనీ గూగుల్ లే ఆఫ్ ప్ర‌క‌టిస్తున్న‌ద‌న్న వార్త‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. గూగుల్ కంపెనీకి అనుబంధ కంపెనీగా ఉన్న ఆల్ఫాబెట్‌లో 6% ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. అంటే దాదాపు ప‌ది వేల మంది రోడ్డున ప‌డ‌బోతున్నార‌ని తెలుస్తున్న‌ది. అయితే ఈ వార్త‌ల‌ను గూగుల్ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

ఈ మ‌ధ్య కాలంలో కంపెనీ సీఈఓ సుంద‌ర్ పిచయ్ కంపెనీలో ఉద్యోగుల ప‌నితీరు, అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేద‌ని ఓ స‌మావేశంలో ప్ర‌క‌టించారు. ఆయ‌న మాట‌ల‌ అంత‌రార్థం అదేన‌ని టెక్ వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి. అంత‌ర్జాతీయంగా మ‌రో దిగ్గ‌జ కంపెనీ ట్విట‌ర్‌ను ఎల‌న్ మ‌స్క్ సొంతం చేసుకున్న త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు అంద‌రినీ భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసింది.

ఆయ‌న ఏకంగా ట్విట‌ర్‌లోని ఉన్న‌తో ద్యోగుల్లో 60శాతం మందిని అంటే 7 వేల మందిని బ‌య‌ట‌కు పంపారు. ప‌నివేళ‌లు పెంచి, క‌ష్టంగా భావించిన వారు వెళ్లిపోవ‌చ్చ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఊహించిన దానికి భిన్నంగా ఉన్న‌త ఉద్యోగులు రాజీనామాలు చేసి ఇంటిబాట ప‌ట్టారు.

తాజాగా గూగుల్ లో లే ఆఫ్ ప్ర‌క‌టిస్తున్నార‌న్న వార్త‌లు కూడా అంద‌రిలో గుబులు పుట్టిస్తున్నాయి. ప్ర‌పంచంలోని అనేక దేశాలు ఆర్థిక మాంద్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప‌రిస్థితుల్లో గూగుల్ గురించిన వార్త‌లు ఒట్టి పుకార్లు కాక‌పోవ‌చ్చ‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. ఏది ఏమైనా సాఫ్ట్ రంగంలోని ఉద్యోగ వ‌ర్గానికి రాబోయే కాల‌మంతా గ‌డ్డు కాల‌మేన‌ని ఆర్థిక‌వేత్త‌లంతా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Updated On 23 Nov 2022 7:42 AM GMT
krs

krs

Next Story