Viral Video | ఓ పెళ్లి విందు వివాదానికి దారి తీసింది. వ‌చ్చిన అతిథులు కుర్చీలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్‌లో చోటు చేసుకోగా, అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. పెళ్లికి వ‌చ్చిన వారంతా ఆప్యాయంగా ప‌లుక‌రించుకుంటూ.. త‌మ‌కు కేటాయించిన టేబుల్స్ వ‌ద్ద ఆశీనులై.. భోజ‌నాల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. అంత‌లోనే ఓ టేబుల్ వ‌ద్ద‌కు ఓ వ్య‌క్తి త‌న స‌హ‌చ‌రుల‌తో వ‌చ్చాడు. విందు ఆర‌గిస్తున్న ఓ వ్య‌క్తి త‌ల‌పై ఉన్న టోపీని ముందున్న ప్లేట్‌లోకి […]

Viral Video | ఓ పెళ్లి విందు వివాదానికి దారి తీసింది. వ‌చ్చిన అతిథులు కుర్చీలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్‌లో చోటు చేసుకోగా, అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

పెళ్లికి వ‌చ్చిన వారంతా ఆప్యాయంగా ప‌లుక‌రించుకుంటూ.. త‌మ‌కు కేటాయించిన టేబుల్స్ వ‌ద్ద ఆశీనులై.. భోజ‌నాల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. అంత‌లోనే ఓ టేబుల్ వ‌ద్ద‌కు ఓ వ్య‌క్తి త‌న స‌హ‌చ‌రుల‌తో వ‌చ్చాడు. విందు ఆర‌గిస్తున్న ఓ వ్య‌క్తి త‌ల‌పై ఉన్న టోపీని ముందున్న ప్లేట్‌లోకి తోసేశాడు. దీంతో మ‌రో వ్య‌క్తి.. టోపీ తీసేసిన వ్య‌క్తిపై దాడి చేశాడు. ఒక‌రికొక‌రు కుర్చీల‌తో దాడులు చేసుకున్నారు. ఇనుప రాడ్ల‌తో కొట్టుకున్నారు. దాదాపు ఓ ఐదు నిమిషాల పాటు ఇరు వ‌ర్గాలు దాడులు చేసుకున్నారు. అక్క‌డున్న ఆహారమంతా నేల‌పాలైంది. మ‌హిళ‌లు తీవ్ర భయాందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న ఆగ‌స్టు 24న చోటుచేసుకోగా, ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న‌కు మ‌ట‌న్ వేయ‌క‌పోతే ఇలానే విసిగిపోతాను అని నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు పెడుతున్నారు.

Updated On 2 Sep 2023 2:59 AM GMT
sahasra

sahasra

Next Story