Gufi Paintal | విధాత: ఒకానొక సమయంలో దేశం మొత్తాన్ని టీవీలకు కట్టిపడేసిన మహాభారతం సీరియల్‌లో శకుని పాత్ర పోషించిన గుఫీ పైంతల్ (79) చివరి శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న గుఫీ.. సోమవారం ఉదయం ముంబయిలోని ఓ ఆస్పత్రిలో మరణించారని ఆయన బంధువు మీడియాకు వెల్లడించారు. ఎనిమిది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. ప్రశాంతంగా నిద్రలోనే కన్నమూశారని తెలిపారు. గుఫీ మహాభారతంలోనే కాకుండా సుహాగ్, దిల్లాగీ వంటి సినిమాలతో పాటు సీఐడీ, హలో […]

Gufi Paintal |
విధాత: ఒకానొక సమయంలో దేశం మొత్తాన్ని టీవీలకు కట్టిపడేసిన మహాభారతం సీరియల్‌లో శకుని పాత్ర పోషించిన గుఫీ పైంతల్ (79) చివరి శ్వాస విడిచారు.
వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న గుఫీ.. సోమవారం ఉదయం ముంబయిలోని ఓ ఆస్పత్రిలో మరణించారని ఆయన బంధువు మీడియాకు వెల్లడించారు. ఎనిమిది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. ప్రశాంతంగా నిద్రలోనే కన్నమూశారని తెలిపారు.
గుఫీ మహాభారతంలోనే కాకుండా సుహాగ్, దిల్లాగీ వంటి సినిమాలతో పాటు సీఐడీ, హలో ఇన్‌స్పెక్టర్ తదితర టెలివిజన్ షోలలోనూ నటించి సందడి చేశారు. అంధేరీ సబర్బన్‌లోని సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
కొవిడ్ సమయంలో పునఃప్రసారమైన మహాభారతం అప్పుడూ రేటింగ్‌ల్లో దుమ్ము దులిపింది. అందులోని ప్రతి పాత్రకూ ఉన్నట్లే కుట్రకు, కార్పణ్యానికి ప్రతిరూపంగా నిలిచే శకుని అభినయానికి పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు.
