విధాత: రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశంలో ఆసక్తి రేపిన మునుగోడుఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 15 రౌండ్ల ఓట్ల లెక్కింపులో టిఆర్ఎస్, బిజెపిల మధ్య హోరాహోరీగా పోటీ సాగగా, 2,3,15వ రౌండ్లు మినహా మిగతా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల మెజారిటీ సాధించి విజయకేతనం […]

విధాత: రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశంలో ఆసక్తి రేపిన మునుగోడుఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 15 రౌండ్ల ఓట్ల లెక్కింపులో టిఆర్ఎస్, బిజెపిల మధ్య హోరాహోరీగా పోటీ సాగగా, 2,3,15వ రౌండ్లు మినహా మిగతా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల మెజారిటీ సాధించి విజయకేతనం ఎగరవేశారు. మొత్తం 2,41805 ఓట్లకు గాను 2,25192 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పైనున్నోడు ఫేకుడు.. కిందున్నోడు జోకుడు: BJPపై కేటీఆర్ నిప్పులు

నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీకి పోస్టల్, సర్వీస్ బ్యాలెట్లలో వచ్చిన 408 ఓట్లు కలిపి 10, 309 ఓట్ల మెజార్టీ లభించింది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి పోస్టల్ ఓట్లు 212తో కలిపి 86,697ఓట్లు రాగా, డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అభ్యర్థికి స్రవంతికి పోస్టల్ ఓట్లు 42తో కలిపి 23,906 ఓట్లు పోలయ్యాయి. హోరా హోరీగా సాగిన మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫలితాల అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి సంబురాలు జరుపుకున్నారు.

ఉప ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యత వస్తుందని భావించిన చౌటుప్పల్, చండూరు మండలాలు తో పాటు గట్టుపల్ ,నాంపల్లి , సంస్థాన్ నారాయణపూర్, మర్రిగూడ, మునుగోడు సహా మొత్తం ఏడు మండలాల్లో టిఆర్ఎస్ పార్టీ బిజెపి కంటే అధిక ఓట్లు సాధించింది. ఎన్నికల్లో నాలుగో స్థానంలో బీఎస్పీ పార్టీ నిలిచింది. కారు గుర్తు పోలిన రోడ్ రోలర్, రోటి మేకర్, చెప్పు గుర్తు అభ్యర్థులకు వేయ్యికి పైగా ఓట్లు నమోదు కావడంతో ఆ మేరకు కొంత టీఆర్ఎస్ అభ్యర్థి మెజార్టీ తగ్గినట్లయినంది.

ఎన్నికల్లో కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా, కాంగ్రెస్ నుండి రాజీనామా చేసి బిజెపిలో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 20,000 కు పైగా ఓట్లు సాధించడం, కమ్యూనిస్టుల ఓట్లు కలిసి రావడంతో పాటు అధికార పార్టీగా పోల్ మేనేజ్మెంట్ టిఆర్ఎస్ కు హోరాహోరీ పోరులో విజయాన్ని కట్టబెట్టింది.

మునుగోడు టీఆర్‌ఎస్‌దే?.. ప్రజల మనోగతం ఇదే! (విధాత ప్రత్యేక సర్వే నిజమైంది)

ఓడిన చోటే గెలిచిన కూసుకుంట్ల

మునుగోడు నియోజకవర్గంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డికి 97,239 ఓట్లు రాగా, టిఆర్ఎస్ నుండి ఓడిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 74,687 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డికి 12,275 ఓట్లు రాగా 22,552 ఓట్ల మెజార్టీతో ఆ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిచారు.

ఈటల స్వరం మారుతున్నదా?

అంతకుముందు 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన ప్రభాకర్ రెడ్డికి 69 వేల 496 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డికి 27,434 ఓట్లు, కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసిన పాల్వాయి స్రవంతికి 27,441 ఓట్లు, సిపిఐ అభ్యర్థి పల్లా వెంకటరెడ్డికి 20,952 ఓట్లు రాగా, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 38,058 ఓట్లతో గెలుపొందారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ చేజార్చుకున్న మునుగోడు స్థానాన్ని ఉప ఎన్నికలలో తిరిగి నిలబెట్టుకోగా, కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది.

గులాబీ వనమైన నల్గొండ

నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపుతో 12 స్థానాల్లోనూ ప్రస్తుతం ఆ పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అయింది. అయితే గత ఎన్నికల్లో నకిరేకల్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి లింగయ్య, దేవరకొండలో సీపీఐ నుంచి గెలిచిన రవీంద్రకుమార్‌లు ఎన్నికల అనంతరం టీఆర్ఎస్‌లో చేరగా..

CM KCR ఇన్‌చార్జి గ్రామంలో టీఆర్ఎస్‌కు మెజార్టీ

తాజాగా మునుగోడలో ప్రభాకర్ రెడ్డి గెలుపుతో ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోనే కొనసాగుతుండటం విశేషం. దీంతో ఒకప్పుడు కమ్యూనిస్టుల ఖిల్లాగా, తదుపరి కాంగ్రెస్ కంచుకోటగా కొనసాగిన ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపుతో పూర్తిగా గులాబీమయం అయిపోవడం ఆసక్తికరం.

ఇప్పుడు.. బీజేపీలోకి వెళ్లిన వాళ్ల పరిస్థితి ఏమిటి?

ఉప ఎన్నికల్లో జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయాలు

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘనవిజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించిన జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ విజయాలను సాధించినట్లయ్యింది.

రాష్ట్రంలో జరిగిన ఐదు ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్, హుజూర్ నగర్ , నాగార్జున సాగర్, మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన మూడు నియోజకవర్గాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డి నాయకత్వంలో గెలిచినవే కావడం ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం.

దీంతో టీఆర్ఎస్ అగ్రనాయకత్వం, జిల్లా పార్టీ శ్రేణులు హాట్సాఫ్ జగదీష్ రెడ్డి అంటూ అభినందనలతో ముంచేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాలను ప్రభావితం చేస్తుందని భావించిన మునుగోడు ఉప ఎన్నికలు టీఆర్ఎస్‌కు గెలుపు అందించడంపై ఆయనకు అభినందనలు వెలువెత్తుతున్నాయి.

అధ్యక్షుడు సరే.. పార్టీ ఎక్కడుంది బాబూ!

Updated On 6 Nov 2022 4:14 PM GMT
krs

krs

Next Story