Viral Video | ఓ వ్యక్తి అత్యుత్సాహం ప్రదర్శించాడు. కారులో వెళ్తున్న ఓ వ్యక్తికి కచ్చా రోడ్డుపై నాగుపాము కనిపించింది. ఆ పాము అప్పటికే పడగవిప్పి కూర్చుంది. ఈ క్రమంలో కారులో వెళ్తున్న ఆ వ్యక్తి.. ఆ పామును కవ్వించేందుకు యత్నించాడు.
ఇంకేముంది తన వద్ద రివాల్వర్‌ను బయటకు తీశాడు. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా పాము పడగపై కాల్పులు జరిపాడు. కానీ మొదటి బుల్లెట్ భూమికే తాకింది. దీంతో మరో సారి కాల్పులు జరిపాడు. అది కూడా మిస్ అయింది. తనపై కాల్పులు జరపడంతో పాముకు కోపం వచ్చినట్లుంది. కారులో ఉన్న వ్యక్తిపై నాగుపాము దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ నాగుపాము డేర్ డెవిల్ అని పేర్కొంటే.. మరికొందరేమో.. మూడోసారి కాల్పులకు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. అలాగే పాముపై కాల్పులు జరపడాన్ని పలువురు తీవ్రంగా ఖండించారు. వినోదం కోసం ఇలాంటి పనులు చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.