విధాత: వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందే చెప్పింది. టీఎస్‌పీఎస్పీ గడిచిన 8 నెలల కాలంలో 22 నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనికి తోడు పోలీసు నియామక బోర్డు ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ, ఫిజికల్‌ ఈవెంట్స్‌ పరీక్షలు పూర్తి చేసి, మెయిన్స్‌ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. వీటికితోడు చాలాకాలంగా గురుకుల నియామక బోర్డు ఉద్యోగ ప్రకటనలు వస్తాయని వార్తలు వస్తున్నాయి. కొన్ని సాంకేతిక కారణాలతో ఆ […]

విధాత: వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందే చెప్పింది. టీఎస్‌పీఎస్పీ గడిచిన 8 నెలల కాలంలో 22 నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీనికి తోడు పోలీసు నియామక బోర్డు ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ, ఫిజికల్‌ ఈవెంట్స్‌ పరీక్షలు పూర్తి చేసి, మెయిన్స్‌ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది.

వీటికితోడు చాలాకాలంగా గురుకుల నియామక బోర్డు ఉద్యోగ ప్రకటనలు వస్తాయని వార్తలు వస్తున్నాయి. కొన్ని సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ ముందుకు పడలేదు. అయితే తాజాగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకులాల్లో ఒకేసారి 11 వేలకు పైగా పోస్టులకు ప్రకటనలు విడుదల చేయాలని గురుకుల నియామకబోర్డు గురువారం నిర్ణయించింది.

ఈ ఏడాదికి మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాల్లలో కేబినెట్‌ ఆమోదించిన సుమారు 2,591 పోస్టులకు ఫైనాన్స్‌ శాఖ ఆమోదం వచ్చిన వారం పదిరోజుల్లోగా నోటిఫికేషన్లు వెలువరించేందుకు కసరత్తు పూర్తి చేసింది. సంక్షేమ శాఖల వారీగా ప్రతిపాదనలు పరిశీలించిన బోర్డు, బీసీ గురుకులాలకు సంబంధించి ఆర్థికశాఖ నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నది. అదనపు పోస్టులకు రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత నియామకబోర్డుకు ప్రతిపాదనలు పంపించేలా గురుకుల సొసైటీ ఇప్పటికే రోస్టర్‌, జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టుల గుర్తింపు పూర్తిచేసింది. సంక్షేమ గురుకులాల్లో 9,096 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అదనపు పోస్టులతో కలిపి ఒకేసారి ఈ నెల రెండోవారంలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని గురుకుల నియామక బోర్డు సిద్ధమవుతున్నది.

Updated On 4 Jan 2023 4:54 AM GMT
krs

krs

Next Story