విధాత: నల్గొండ (Nalgonda) జిల్లా మిర్యాలగూడెంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ రాజా బహుదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన, వికాస కేంద్ర భవన నిర్మాణానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy), మాజీ మంత్రి ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (MP N. Uttam Kumar Reddy) లు శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గుత్తా, ఉత్తమ్ లు మాట్లాడుతూ.. రెడ్డి సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.
సామాజిక సేవకు రెడ్డి పర్యాయపదం అన్నారు. అన్ని రంగాలలో రెడ్డిల అభివృద్ధి ఇతర వర్గాలకు ఆలంబనగా, చేయూతనిచ్చేదిగా సాగాలన్నారు. తన చుట్టూ ఉన్న జనహితమే రెడ్డి లక్ష్యంగా ఆదర్శనీయంగా పని చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి (Tippana Vijayasimha Reddy), రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరి భార్గవ్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు అనుముల మధుసూదన్ రెడ్డి, అభ్యాస విద్యాసంస్థల చైర్మన్ కౌన్సిలర్లు వంగాల నిరంజన్ రెడ్డి, జయలక్ష్మి , దేశిరెడ్డి శేఖర్ రెడ్డి, జలంధర్ రెడ్డి, ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ రేపాల పురుషోత్తం రెడ్డి, మాజీ డైరెక్టర్ సజల రవీందర్ రెడ్డి, సర్పంచ్ లు అంజిరెడ్డి, సోమిరెడ్డి, శేఖర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.