HomelatestH1B Visa: H1B ఇండియన్‌ టెక్కీలకు రిలీఫ్‌.. జీవిత భాగస్వాములూ కొలువుల్లో చేరొచ్చు

H1B Visa: H1B ఇండియన్‌ టెక్కీలకు రిలీఫ్‌.. జీవిత భాగస్వాములూ కొలువుల్లో చేరొచ్చు

విధాత: హెచ్‌1బీ(H1B) వీసా(Visa)లపై అమెరికాలో పనిచేస్తున్నవారికి పెద్ద ఊరట లభించింది. ఈ వీసాలతో వచ్చే వారి భార్య/భర్త కూడా అమెరికాలో ఇకపై ఉద్యోగాలు చేయవచ్చని జిల్లా కోర్టు ఒకటి తీర్పు చెప్పింది. హెచ్‌1బీ వీసాదారుల వల్ల స్థానికులు ఉద్యోగాలు కోల్పోతున్నారంటూ ‘సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ’ (Save Jobs USA) అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జడ్జి కొట్టేశారు.

హెచ్‌1బీ వీసా కార్యక్రమం.. నిపుణులైన విదేశీ వర్కర్లు అమెరికాకు వచ్చి, అమెరికన్‌ కంపెనల్లో పనిచేసేందుకు అవకాశం కల్పించేది. అయితే.. ఈ వీసాపై వచ్చేవారి భార్య లేదా భర్త అమెరికాలో పనిచేసేందుకు అవకాశం లేదు. ఇప్పడు దీనిని సడలించారు. తాజా తీర్పు వల్ల వేల మంది విదేశీ నిపుణులకు మేలు కలుగుతుంది.

ప్రత్యేకించి అమెరికాలో భారీ సంఖ్యలో ఉన్న భారతీయ ఐటీ(IT) నిపుణులకు ఎంతో వెసులుబాటును ఇస్తుంది. సేవ్‌జాబ్స్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను టెక్‌ దిగ్గజాలైన అమెజాన్‌, యాపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ తదితర కంపెనీలు వ్యతిరేకించాయి. కోర్టు తీర్పుపై అమెరికాలోని హెచ్‌1బీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశంలోని వేల కుటుంబాలకు ఎంతగానో ఊరటనిస్తుందని చెబుతున్నారు.

భర్త లేదా భార్య స్వదేశంలో ఉండి.. ఒకరు ఇక్కడ పనిచేయడంతోపాటు.. ఇక్కడే ఉన్నా.. తగిన అర్హతలు ఉండీ పనిచేసే అవకాశం లేని వారికి ఈ తీర్పు ఉపయోగపడుతుందని, వారు కూడా ఉద్యోగం చేసుకుని, స్థిరపడేందుకు అవకాశం దక్కుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక సంబంధమైనది మాత్రమే కాదని, కుటుంబ ఐక్యత, స్థిరత్వానికి సంబంధించినదని భారతీయ ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు అభివర్ణిస్తున్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular