Harsha Sai | కొత్త కంటెంట్‌ని ప్రేక్ష‌కులు ఎప్పుడు ఆద‌రిస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో కంటెంట్‌ కొత్తగా ఉన్న సినిమాలు హిట్ చేసేస్తున్నారు. కథ, కథనం కాస్త ఎంగేజింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌ ఉంటే హీరో ఎవర‌నేది కూడా చూడ‌కుండా ఆ సినిమాని సూప‌ర్ హిట్ చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో మ‌రో మంచి కంటెంట్ ఉన్న సినిమా రాబోతుంద‌ని తెలుస్తుంది. యూట్యూబ్‌ సెస్సేషన్‌ హర్ష సాయి డెబ్యూ చిత్రం మెగా, కాగా రీసెంట్‌గా సినిమా టైటిల్‌ లాంచ్‌ను హర్ష […]

Harsha Sai |

కొత్త కంటెంట్‌ని ప్రేక్ష‌కులు ఎప్పుడు ఆద‌రిస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో కంటెంట్‌ కొత్తగా ఉన్న సినిమాలు హిట్ చేసేస్తున్నారు. కథ, కథనం కాస్త ఎంగేజింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌ ఉంటే హీరో ఎవర‌నేది కూడా చూడ‌కుండా ఆ సినిమాని సూప‌ర్ హిట్ చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో మ‌రో మంచి కంటెంట్ ఉన్న సినిమా రాబోతుంద‌ని తెలుస్తుంది.

యూట్యూబ్‌ సెస్సేషన్‌ హర్ష సాయి డెబ్యూ చిత్రం మెగా, కాగా రీసెంట్‌గా సినిమా టైటిల్‌ లాంచ్‌ను హర్ష సాయి గ్రాండ్‌గా నిర్వహించాడు. ఇక ఇదే ఈవెంట్‌లో మూడు నిమిషాల పాటు ఉన్న ఓ గ్లింప్స్‌ను కూడా విడుద‌ల చేశారు. ఇందులో ఇచ్చిన బిల్డప్, చూపించిన విజువల్స్, చెప్పిన డైలాగ్స్ ఆక‌ట్టుకున్నాయి.

డైలాగ్స్ చాలా పవర్ ఫుల్‌గా అనిపించ‌గా, విజువల్స్ కూడా చాలా గ్రాండియర్‌గా కనిపించాయి. గ్లింప్స్‌లో ఓ పెద్ద గంటను చూపిస్తూ దాని కింద మనిషిని వేలాడ దీసి గంట కొడితే మనిషి చనిపోతాడంటూ.. ఇలాంటి శిక్షను అనుభవించడానికి రెడీగా ఉన్న హర్ష సాయిని చూపించ‌డం ఆస‌క్తిని రేపింది.

వందల మంది మధ్య హర్ష సాయిని ఆ గంటకు కట్టి వేలాడ దీశారు.. మధ్యలో ఓ వింత మాస్క్‌ వేసుకున్న ఓ వ్యక్తి హర్షకు చావు సవాల్‌ విసురుతుంటాడు. ఆ మాటలకు మైకం నుంచి బయటకు వచ్చిన హర్ష అసలు చావంటే ఏంటి? అది నీకు చావకుండానే ఎలా తెలుస్తుంది అంటూ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ వినిపిస్తుంది.

ఇక అదే స‌మ‌యంలో వంద సింహాలు ఒకేసారి కొరికితే ఎలా ఉంటుందో మెగాలోడాన్‌ కొరికితే అలా ఉంటుందని మెగా ముందు ఎదైనా దిగదుడిపే అన్న రేంజ్‌లో హర్షకు ఎలివేషన్ ఇవ్వ‌డం మూవీపై అంచ‌నాలు పెంచింది. అయితే ప్ర‌స్తుతం మెగా టీజ‌ర్ దుమ్ము రేపుతుంది.

టీజర్‌ విడుద‌లైన 22 గంటల్లో 3.5 మిలియన్ వ్యూస్ రాబ‌ట్టింది. ఇంత వ్యూస్ రావ‌డం ప‌ట్ల అంద‌రు షాక్ అవుతున్నారు. స్టార్ హీరోల సినిమాల టీజర్, ట్రైల‌ర్‌ల‌కి కూడా ఈ రేంజ్‌లో వ్యూస్ రాలేదు. ప‌వ‌న్, ప్ర‌భాస్ వంటి స్టార్ హీరోల సినిమాల‌కి కూడా ఏ నాడు ఇంత త‌క్కువ టైంలో వ్యూస్ రాలేదు.

ఒక డెబ్యూ హీరో మూవీ గ్లింప్స్‌కి ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి మెగాపై ప‌డింది. చూస్తుంటే ఈ సినిమా గ్రాండియర్‌గా, పెద్ద స్కేల్‌పైన తెరకెక్కుతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కూడా హర్ష సాయే అవడం విశేషం. ఈ సినిమాను బిగ్‌బాస్‌ ఫేం మిత్రా శర్మ నిర్మిస్తుండ‌డం మ‌రో విశేషం.

Updated On 18 Sep 2023 7:57 AM GMT
sn

sn

Next Story