Alcohol | Haryana |
పని చేసే ప్రదేశాల్లో మద్యం నిషేధం. కానీ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెసులుబాటు కల్పించింది. ఇకపై కార్పొరేట్ ఆఫీసు క్యాంటీన్లలోనూ బీర్లను తాగేందుకు అనుమతించింది. ఈ మేరకు హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2023-24 సంవత్సరానికి గానూ హర్యానా ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. అయితే అతి పెద్ద కార్పొరేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు తమ ఆఫీసు పరిసరాల్లో ఆల్కహాల్ శాతం తక్కువ ఉన్న బీరు, వైన్ వంటి వాటిని తాగేందుకు అనుమతించింది.
ఈ నిబంధన ఈ ఏడాది జూన్ 12వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే 5 వేల మంది కన్నా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉండి, కనీసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సంస్థలు తమ ఉద్యోగులకు మద్యం సరఫరా చేయొచ్చు అని హర్యానా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.