విధాత‌, సినిమా: ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది RRR మూవీ. దర్శకధీరుడు రాజమౌళి ప్రాణం పెట్టి ఈ సినిమాను తెరకెక్కించగా హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్‌లు అంతే అద్భుతంగా నటించారు. టెక్నీషియన్ల నుంచి అందరూ అమేజింగ్ అవుట్‌పుట్ అందించారు. అందుకే ఈ టాలీవుడ్ చిత్రానికి హాలీవుడ్ బ్రహ్మరథం పట్టింది. ఆస్కార్ నామినేషన్‌లో ఉండగా.. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులను ఈ చిత్రం కొల్లగొట్టింది. ఈ మధ్యనే హాలీవుడ్ […]

విధాత‌, సినిమా: ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది RRR మూవీ. దర్శకధీరుడు రాజమౌళి ప్రాణం పెట్టి ఈ సినిమాను తెరకెక్కించగా హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్‌లు అంతే అద్భుతంగా నటించారు. టెక్నీషియన్ల నుంచి అందరూ అమేజింగ్ అవుట్‌పుట్ అందించారు.

అందుకే ఈ టాలీవుడ్ చిత్రానికి హాలీవుడ్ బ్రహ్మరథం పట్టింది. ఆస్కార్ నామినేషన్‌లో ఉండగా.. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులను ఈ చిత్రం కొల్లగొట్టింది. ఈ మధ్యనే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌లో నాలుగు విభాగాలలో అవార్డులను గెలుచుకుంది. రాజమౌళితో సహా సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి, హీరో రామ్ చరణ్ ఈ ట్రోఫీలను అందుకోవడానికి అమెరికా వెళ్లారు.

అయితే RRR టీం అంతా హాజరైనా.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇది ఏదో లోటుగా ఫీల్ అయ్యారు అభిమానులు. సోషల్ మీడియాలో ఊరికే ఉంటారా ఈ వేడుకకు అసలు ఎన్టీఆర్‌ను పిలవ లేదని కొంతమంది విమర్శలు గుప్పిస్తుంటే.. ఎందుకు ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరు కాలేదనే దానిపై తాజాగా హెచ్‌సీఏ(HCA) ట్విట్ట‌ర్ వేదికగా స్పందించింది.

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఎన్టీఆర్ అభిమానులకు స్పష్టతనిచ్చింది. అవార్డ్స్‌కి హాజరు కావాలని మేము ఎన్టీఆర్‌ను కూడా ఆహ్వానించాము. కానీ ఆయన ఇండియాలో తన కొత్త మూవీ ప్రాజెక్టు షూటింగ్‌లో బిజీగా ఉన్నారు అందుకే రాలేకపోయారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తరపున ఎన్టీఆర్‌కు అవార్డు అందజేస్తామని ప్రకటించారు.

అయితే ఎన్టీఆర్ ఏదో సినిమా షూటింగ్ వల్ల హాజరు కాకపోవడం కాదు తన సోదరుడు నందమూరి తారకరత్న మరణించడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయాడనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అభిమానులు అత్యుత్సాహం వేరేలా ఉంటుంది కదా. అన్నీ తెలిసి కూడా వారు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించడమేంటో వారికే తెలియాలి.

Jrntr
JR NTR

వాస్తవానికి జూనియర్ ఫిబ్రవరి 20 అమెరికా వెళ్లాలని అనుకున్నారు. అయితే ఫిబ్రవరి 18న తన సోదరుడు, నటుడు నందమూరి తారకరత్న మరణించారు. దాంతో ఆయ‌న ఈ వేడుక‌కు హాజ‌రుకాలేదు. ఇదేం టైమ్‌లో తను కొరటాలతో చేయాలనుకున్న మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరగాల్సి ఉండగా అవి కూడా వాయిదా పడ్డాయి.

Updated On 1 March 2023 12:14 PM GMT
Somu

Somu

Next Story