Wednesday, December 7, 2022
More
    Homelatestఅసలైన సైంటిస్ట్.. ఒక్క సిగరెట్ తో 11 రాకెట్లు వెలిగించాడు.. వీడియో వైరల్

    అసలైన సైంటిస్ట్.. ఒక్క సిగరెట్ తో 11 రాకెట్లు వెలిగించాడు.. వీడియో వైరల్

    విధాత: దీపావళి అంటేనే ప్రతి ఇంట్లో, దుకాణంలో దీపాలంకరణ చేస్తారు. పటాకులు కాల్చి ఎంజాయ్ చేస్తారు. ఈ దీపావళి వేళ ఓ వృద్ధుడు పెద్ద సాహసమే చేశాడు. అసలైన సెంటిస్టు ఈ వృద్ధుడే అని పొగిడేస్తున్నారు. మరి ఆ ముసలాయన చేసిన అంత గొప్ప పని ఏంటో తెలుసా.. ఒకే ఒక్క సిగరెట్ తో 11 రాకెట్లను వెలిగించాడు. అది కూడా కేవలం 19 సెకన్ల నిడివిలో.

    ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. నడిరోడ్డుపై నిల్చున్నాడు ఓ వృద్ధుడు. ఇక సిగరెట్ వెలిగించాడు. చేతిలో ఉన్న 11 రాకెట్లను ఒక్కొక్కటిగా సిగరెట్ నిప్పుతో అంటించాడు. ఆ రాకెట్లు అతివేగంతో ఆకాశంలో దూసుకెళ్లాయి. కేవలం 19 సెకన్లలోనే 11 రాకెట్లను ఆకాశంలోకి పంపిన ఈ ముసలాయనే నిజమైన శాస్త్రవేత్త అని కొందరు నెటిజన్లు పొడిగారు.

     

     

    మరికొందరేమో.. ఇలాంటి ప్రమాదకర పనులు చేయొద్దంటూ హెచ్చరించారు. పిల్లలు కూడా ఇలానే చేస్తే కష్టంగా ఉంటుందని సూచించారు. కొందరు రాకెట్ మ్యాన్ అని పిలుస్తున్నారు. స్పేష్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ కు ఈయనను కచ్చితంగా పరిచయం చేయాలని కొందరు సూచించారు. రాకెట్ లాంచర్లు అవసరం లేదు.. ఇతనికి ఆ పోజిషన్ ఇస్తే చాలన్నారు.

     

     

    సుశాంత నంద ట్వీట్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 9 లక్షల 62 వేల మంది వీక్షించగా, 22 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియో వాస్తవానికి 2018లో చిత్రీకరించబడింది. విశాఖపట్టణంకు చెందిన వృద్ధుడు అని నెటిజన్లు పేర్కొంటున్నారు. దీపావళి వేళ మరోసారి ఆ పాత వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page