Thursday, March 23, 2023
More
    Homelatestరాజమౌళితో చిత్రం కోసమే ఆయన ఇంత తపన పడుతున్నారా..?

    రాజమౌళితో చిత్రం కోసమే ఆయన ఇంత తపన పడుతున్నారా..?

    విధాత‌: రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంటూ విశ్వవేదికపై విజయకేతనం ఎగురవేస్తోంది. ప్రస్తుతం ఆస్కార్ బ‌రిలో దూసుకునిపోతోంది. నాటు నాటు పాటకు ఇప్పటికే పలు అవార్డులు లభించాయి. మార్చి 12న లాస్ఏంజెల్స్ లో జరగనున్న అవార్డుల వేడుకల‌లో ఈ చిత్రం ఆస్కార్ను దక్కించుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం ఆస్కార్ ఫైనల్ లిస్టులో చేరడంతో అభిమానులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

    ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఆస్కార్ బ‌రి లో నిలిచిన వేళ బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్ల‌గ‌డ్డ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న హంగామా పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళితో మరో చిత్రం చేయడం కోసమే శోభు యార్లగడ్డ ఇలా మీడియాలో కనిపిస్తూ రాజమౌళికి సన్నిహితంగా ఉంటూ ఆస్కార్ విషయంలో నానాహంగామా చేస్తున్నాడని అంటున్నారు.

     

     

    దీనికి ఒక బలమైన కారణం కూడా ఉంది. 2004లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు కోవెలమూడి ప్రకాష్ నటించిన మార్నింగ్ రాగా చిత్రాన్ని కూడా ఆర్కే వారే నిర్మించారు. అప్పట్లో ఈ మూవీ ని ఆస్కార్కు నామినేట్ చేయాలని శోభు యార్లగడ్డ ప్రయత్నం చేశారు. ఆస్కార్ విషయంలో శోభు యార్లగడ్డకు ఎంతో అనుభవం ఉంది. ఆ నామినేషన్ల ప్రక్రియ, అవార్డుల ప్రాసెస్ వంటి విషయాలను ఆయన తనకున్న అనుభవాన్ని రంగరించి తనకున్న పరిచయాలతో రాజమౌళికి ఆర్ఆర్ఆర్ చిత్రం విషయంలో సహాయం చేస్తున్నారు.

     

    తాజాగా ఈ కామెంట్లపై శోభు యార్లగడ్డ కూడా వివరణ ఇచ్చారు. బాహుబలికి ముందు నుంచి రాజ‌మౌళి నాకు తెలుసు. మేము మంచి స్నేహితులం. ఆయన నాకు చాలా మిత్రుడు. కేవలం నాతో సినిమా చేస్తాడనే ఆలోచనతో ఇదంతా చేయడం లేదు. సామాన్య జనంలో ఆస్కార్ ప్ర‌క్రియపై అవగాహన కల్పించడం కోసమే ఇదంతా చేస్తున్నానని చెప్పారు. ఇక ఈ సంస్థ 2021లో పెళ్లి సందడి మూవీ నిర్మించారు. 2022లో నెట్ ఫిక్స్ కోసం బాహుబలి- బిఫోర్ ద బిగినింగ్ అంటూ సిరీస్ నిర్మించారు. ఇప్పటివరకు వారు మరో సినిమాను ప్రకటించలేదు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular