Saturday, November 26, 2022
More
  Homehealthవృద్ధాప్యంలోనూ.. శృంగారంతో ఆరోగ్య ప్రయోజనాలు!

  వృద్ధాప్యంలోనూ.. శృంగారంతో ఆరోగ్య ప్రయోజనాలు!

  విధాత‌: ఈ వయసులో ఇదేం రోగం? కృష్ణా రామా అనుకోవాల్సిన వయసులో కొత్త జంట‌లా ఎప్పుడూ మొగుడూ పెళ్లాలు జంట వీడరు, ఏం విడ్డూరమో? ఏమో.. మనుమలున్నారన్న జ్ఞానం కూడా లేదు. ఇంకా ఆ యావ చావలేదు. వయసు పైబడ్డాక కూడా రొమాంటిక్ గా కనిపించే వారి గురించి ఇలా మాట్లాడుకోవడం, ఒకింత ఆడిపోసుకోవడం చూస్తుంటాం సమాజంలో. కానీ ఏవయసులోనైనా ఆ విషయాన్ని ఎంజాయ్ చెయ్యడం మంచిదనే పరిశోధకులు అంటున్నారు. శృంగారం చుట్టూ ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

  చక్కని వ్యాయామం

  శృంగారం కేవలం సృష్టి కార్యం మాత్రమే కాదు. పిల్లలు పుట్టాక మానేయ్యాల్సిన విషయమూ కాదు. మంచి వ్యాయామం కూడా. శరీరానికి వ్యాయామం చాలా అవసరం. ప్రాణాయామం, ధ్యానం మనసును బలోపేతం చేస్తాయి. వాకింగ్, జాగింగ్, జిమ్ వంటివి శరీరం శక్తి సంతరించుకోవడానికి పనికొస్తాయి. కానీ ఏకకాలంలో మనసును, శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే చక్కని వ్యాయామం శృంగారమేనని నిపుణులు చెబుతున్నారు. 50 ఏళ్లు దాటిన వారు చేసే శృంగారం వల్ల ఎన్నో విధాల ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

  మలి వయసులో మరీ మంచిది

  వృద్ధాప్యంలో శృంగారం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనివల్ల మానసిక, భావోద్వేగ పరమైన ఆరోగ్యం మెరుగుపడుతుంది. జంట మధ్య అనుబంధం కూడా బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. పురుషుల్లో ఆత్మ విశ్వాసం కూడా పెంచుతుందట. అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఒక అధ్యయన ఫలితాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. వారంలో కనీసం రెండు సార్లు శృంగారంలో పాల్గొనే పురుషుల్లో హార్ట్ ఎటాక్ ముప్పు దాదాపుగా 50 శాతం తగ్గుతున్నట్టు అధ్యయన కారులు చెబుతున్నారు. శృంగారాన్ని ఆస్వాదిస్తున్న 50 ఏళ్లు దాటిన మహిళలకు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (పీఏడీ/ప్యాడ్) వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతోందట. ఇది రక్తనాళాల్లో వచ్చే సమస్య ఇది ముఖ్యంగా కాళ్లలో ఉండే రక్తనాళాలు కుంచించుకు పోతాయి. దీనివల్ల పక్షవాత ప్రమాదం పొంచి ఉంటుంది.

  మానసిక ఆరోగ్యానికి కూడా…

  శృంగారం వల్ల డిప్రెషన్ తగ్గిపోతుంది. భాగస్వామిలో ఆ సమయంలో ఉండే సాన్నిహిత్యం సెక్యూర్ భావనను కలిగిస్తుంది. ఆందోళన, ఒంటరితనం ఉండవు. క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల ఆనందం, మనుసులో మధుర భావనలకు కారణం అవుతుంది. పురుషులైనా, స్త్రీలైనా తమ మీద తాము గౌరవాన్ని పెంచుకోవడానికి శృంగార సాన్నిహిత్యం దోహదం చేస్తుంది. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో ప్రచురితమైన అధ్యయనం ఆసక్తికర విషయాలను వెలువరించింది. వయసయిపోయిందని భాగస్వామికి దూరంగా ఉండే వారిలో ఎక్కువ మంది డిప్రెషన్, ఒంటరితనంతో బాధపడుతున్నట్టు తెలిసిందట.

  ఆయుర్థాయం కూడా పెరుగుతుంద‌ట‌

  తలనొప్పి, ఆర్థరైటిస్, లాంటి అన్ని రకాల నొప్పుల నుంచి శృంగారంతో ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్ తో బాధ పడుతున్న వారిలో 50 శాతం పైగా వ్యక్తులు తమకు శృంగారంతో ఉపశమనం కలిగినట్టు చెప్పారు. అంతేకాదు శృంగార జీవితం సక్రమంగా ఉన్న వారు వయసు తక్కువగా, అందంగా కూడా కనిపిస్తారట. అందుకు కారణం శరీరంలో జరిగే రసాయన మార్పులట. చక్కని శృంగార జీవితం కలిగిన వ్యక్తుల ఆయుర్థాయం కూడా గణనీయంగా పెరిగినట్టు పరిశోధకుల ఉవాచ. అందకే ఇక వయసు గురించిన ఆలోచన పక్కన పెట్టి ఎలాంటి భేషజాలు లేకుండా మీ భాగస్వామిని మనసారా, తనివితీరా ప్రేమించండి.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page