శృంగారంతో బీపీకి చెక్.. కంటి నిండా నిద్ర.. మతిమరుపు మాయం!
Health Tips | విధాత: దాంపత్య జీవితంలో శృంగారం కీలకమైన ప్రక్రియ. శృంగారం ఇద్దరి మధ్య బంధాన్ని బలోపేతం చేయడమే కాదు.. మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది. శృంగార జీవితానికి సమయం కేటాయించి, ఆస్వాదిస్తే బోలెడు లాభాలున్నాయి. రక్తపోటు(బీపీ)కు చెక్ పెట్టొచ్చు. మతిమరుపు నుంచి దూరం కావొచ్చు. గుండెను పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తపోటుకు చెక్.. శృంగారం చేయడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఎందుకంటే శృంగారం […]

Health Tips | విధాత: దాంపత్య జీవితంలో శృంగారం కీలకమైన ప్రక్రియ. శృంగారం ఇద్దరి మధ్య బంధాన్ని బలోపేతం చేయడమే కాదు.. మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది. శృంగార జీవితానికి సమయం కేటాయించి, ఆస్వాదిస్తే బోలెడు లాభాలున్నాయి. రక్తపోటు(బీపీ)కు చెక్ పెట్టొచ్చు. మతిమరుపు నుంచి దూరం కావొచ్చు. గుండెను పది కాలాల పాటు పదిలంగా ఉంచుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
రక్తపోటుకు చెక్..
శృంగారం చేయడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఎందుకంటే శృంగారం ఒకరకమైన ఏరోబిక్, కండరాలను వృద్ధి చేసే వ్యాయామాల మాదిరిగా ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఆందోళనలను, ఒత్తిడిని తగ్గించి, మనసుకు హాయిని కలుగజేస్తుంది. ఇవి రెండు కూడా బీపీని కంట్రోల్ చేసేవి. కాబట్టి శృంగారం జీవితాన్ని మరింత బలోపేతం చేసుకుని, రక్తపోటుకు చెక్ పెట్టేయండి.
మతిమరుపు మాయం
శృంగారం మతిమరుపును మాయం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. శృంగారం చేయడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది. మెదడు సమర్థవంతంగా పని చేసేందుకు శృంగారం బాగా పని చేస్తుందట. కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ, అధ్యయనాలు మాత్రం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం మూలంగా మెదడులో జ్ఞాపకశక్తితో ముడిపడిన హిప్పోక్యాంపస్ వంటి భాగాలు ప్రేరేపితం అవడం దీనికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
గుండె జబ్బులకు దూరం
శృంగారంతో గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారితో పోలిస్తే.. నెలకు ఒకసారి, అంతకన్నా తక్కువగా శృంగారంలో పాల్గొనే వారికి గుండె సంబంధిత వ్యాధులు అధికంగా వచ్చినట్లు పరిశోధకులు వెల్లడిస్తున్నారు. శృంగారంతో ఆందోళనలను, ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా గుండెను పదిలంగా ఉంచుతాయి.
హాయిగా నిద్రించొచ్చు..
శృంగారంలో భావప్రాప్తి పొందినప్పుడు ప్రేమ హార్మోన్‌గా పిలుచుకునే ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ దంపతుల మధ్య ప్రేమానురాగాలను రెట్టింపు చేస్తుంది. మంచి అనుభూతిని కలిగిస్తుంది. అంతే కాకుండా ఆ సమయంలో ఎండార్ఫిన్లు పుట్టుకొస్తాయి. ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్లు మత్తు మందులా పని చేసేలా.. హాయిగా నిద్ర పోయేలా చేస్తుంది. ఇంకేముంది కంటి నిండా నిద్రపోతే అన్ని రోగాలకు దూరంగా ఉన్నట్టే.
