Health Benefits | సీతాఫ‌లాల సీజ‌న్ ప్రారంభ‌మైంది. అడ‌వుల్లో ఈ ఫ‌లం స‌హ‌జంగా ల‌భిస్తుంది. మార్కెట్లో కూడా విరివిగా ఈ పండ్ల‌ను అమ్ముతున్నారు. చూడ‌డానికి అందంగా క‌నిపించే ఈ ఫ‌లంతో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. కంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. గుండెను ప‌దిలంగా ఉంచుకోవ‌చ్చు. అల్స‌ర్స్‌కు చెక్ పెట్టొచ్చు. ఎసిడీటీ స‌మ‌స్య నుంచి కూడా విముక్తి పొందుచ్చు. పేద‌వాడి యాపిల్‌గా గుర్తింపు పొందిన ఈ సీతాఫ‌లంలో పోష‌కాలు కూడా పుష్క‌లంగా ల‌భిస్తాయి. సీతాఫలంలో విట‌మిన్ సీ, […]

Health Benefits | సీతాఫ‌లాల సీజ‌న్ ప్రారంభ‌మైంది. అడ‌వుల్లో ఈ ఫ‌లం స‌హ‌జంగా ల‌భిస్తుంది. మార్కెట్లో కూడా విరివిగా ఈ పండ్ల‌ను అమ్ముతున్నారు. చూడ‌డానికి అందంగా క‌నిపించే ఈ ఫ‌లంతో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. కంటి స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. గుండెను ప‌దిలంగా ఉంచుకోవ‌చ్చు. అల్స‌ర్స్‌కు చెక్ పెట్టొచ్చు. ఎసిడీటీ స‌మ‌స్య నుంచి కూడా విముక్తి పొందుచ్చు. పేద‌వాడి యాపిల్‌గా గుర్తింపు పొందిన ఈ సీతాఫ‌లంలో పోష‌కాలు కూడా పుష్క‌లంగా ల‌భిస్తాయి.

సీతాఫలంలో విట‌మిన్ సీ, ఐర‌న్, మెగ్నిషీయం, విట‌మిన్ ఏ, పొటాషియం, విట‌మిన్ బీతో పాటు త‌దిత‌ర ముఖ్య‌మైన పోష‌కాలు ల‌భిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. విటమిన్‌ ఏ ఎక్కువగా ఉండటంతో కంటి సమస్యలు దూరమవుతాయి. మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఉండడంతో గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. అల్సర్‌ గ్యాస్‌, మలబద్దకం, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. క్యాన్సర్‌ నిరోధకంగా కూడా ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఎసిడిటీ స‌మ‌స్య ఉన్న వారు కూడా ఈ పండును తినొచ్చు. జీవ‌క్రియ ప్ర‌క్రియ‌ను మెరుగుప‌రుస్తుంది. అంతేకాకుండా మ‌నం తీసుకున్న ఆహారాన్ని శ‌క్తిగా మార్చ‌గ‌ల సామ‌ర్థ్యం కూడా ఈ ఫ‌లానికి ఉంది. సీతాఫ‌లంలో సూక్ష్మ‌పోష‌కాలు పుష్క‌లంగా ల‌భించ‌డంతో.. చ‌ర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది. మ‌న ర‌క్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచుతుంది. రక్తహీనత ఉన్నవారు ,గర్భధారణ సమయంలో హిమోగ్లోబిన్ లోపం ఉన్న మహిళలు ఈ పండును తినవచ్చు.

Updated On 17 Oct 2022 6:15 AM GMT
subbareddy

subbareddy

Next Story