Walnuts | డ్రై ఫ్రూట్స్‌( Dry Fruits )లో రారాజు ఏదంటే.. వాల్ నట్స్( Walnuts ) అని చెప్పొచ్చు. ఎందుకంటే వాల్‌న‌ట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వాల్ న‌ట్స్‌ను ప‌చ్చిగా తిన‌డం కంటే.. నాన‌బెట్టి తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప్ర‌తి రోజు రాత్రి రెండు వాల్ న‌ట్స్ నీళ్ల‌ల్లో నాన‌బెట్టి, పొద్దున్నే ఖాళీ క‌డుపున తినాలి. దీని వ‌ల్ల మెద‌డు( Brain ) చురుకుగా ఉండ‌ట‌మే కాకుండా.. సంతానోత్ప‌త్తి మెరుగు అవుతుంది. అంతే కాకుండా […]

Walnuts | డ్రై ఫ్రూట్స్‌( Dry Fruits )లో రారాజు ఏదంటే.. వాల్ నట్స్( Walnuts ) అని చెప్పొచ్చు. ఎందుకంటే వాల్‌న‌ట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వాల్ న‌ట్స్‌ను ప‌చ్చిగా తిన‌డం కంటే.. నాన‌బెట్టి తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప్ర‌తి రోజు రాత్రి రెండు వాల్ న‌ట్స్ నీళ్ల‌ల్లో నాన‌బెట్టి, పొద్దున్నే ఖాళీ క‌డుపున తినాలి. దీని వ‌ల్ల మెద‌డు( Brain ) చురుకుగా ఉండ‌ట‌మే కాకుండా.. సంతానోత్ప‌త్తి మెరుగు అవుతుంది. అంతే కాకుండా షుగ‌ర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవ‌చ్చు. రోజూ 2 నుంచి 3 వాల్ న‌ట్స్ తినేవారిలో టైప్-2 డ‌యాబెటిస్ వ‌చ్చే ప్ర‌మాదాన్ని త‌గ్గించొచ్చ‌ని ప‌లు అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. మొత్తంగా నానబెట్టిన వాల్ నట్స్‌ను తింటే అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

సంతానోత్ప‌త్తి మెరుగువుతుంది..

ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ బిజీ లైఫ్ గడుపుతున్నారు. దీంతో పురుషులు చాలా ఒత్తిడికి గుర‌వుతున్నారు. దీని ప్ర‌భావం సంతానోత్ప‌త్తిపై ప‌డుతుంది. అంతే కాదు.. ప్రాసెస్ చేసిన ఆహారం, ఇత‌ర ప‌దార్థాలు తిన‌డం వ‌ల్ల స్పెర్మ్ ప‌నితీరు మ‌రింత దిగ‌జారుస్తుంది. స్పెర్మ్ ఆరోగ్యంగా ఉండాలంటే క‌చ్చితంగా ప్ర‌తి రోజు రాత్రి స‌మ‌యంలో రెండు వాల్ న‌ట్స్‌ను తింటే సంతానోత్ప‌త్తిని మెరుగు ప‌రుచుకోవ‌చ్చు. శుక్ర‌క‌ణాలు కూడా చురుకుగా క‌దులుతాయి.

ఎముక‌ల‌కు బ‌లం..

ఎముల‌ను బ‌లోపేతం చేయ‌డానికి వాల్ న‌ట్స్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయి. దంతాలు కూడా బ‌ల‌ప‌డుతాయి. ఎముక‌లు బ‌ల‌ప‌డిన‌ప్పుడే పిల్ల‌ల్లో ధృఢ‌త్వం వ‌స్తుంది. దంతాల‌ను కాపాడుకోవ‌డం కూడా ముఖ్య‌మే. కాబ‌ట్టి వాల్ న‌ట్స్‌ను తిని ఆరోగ్యంగా ఉండండి.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది..

వాల్ న‌ట్స్‌లో ఉండే ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. అధిక ర‌క్త‌పోటు ఉన్న‌వారికి వాల్ న‌ట్స్ మంచిగా ప‌ని చేస్తాయ‌ని ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది. ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి, మంచి కొలెస్ట్రాల్ ఏర్ప‌డేందుకు స‌హాయ‌ప‌డుతాయి. ఇది గుండెకు మేలు క‌లిగిస్తాయి.

వాల్ న‌ట్స్ వ‌ల్ల క్యాన్సర్ దూరం..

వాల్ న‌ట్స్‌ను రెగ్యుల‌ర్ గా తిన‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ల‌ను దూరం పెట్టొచ్చు. రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్స‌ర్ వంటి తీవ్ర‌మైన వ్యాధుల నుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంది. వాల్ న‌ట్స్‌లో ఉండే ఫాలిఫెనాల్ ఎలాగిటానిన్స్ క్యాన్స‌ర్ల నుంచి ర‌క్షించ‌డానికి స‌హాయ‌ప‌డుతాయి. వాల్‌నట్‌లోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.

గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు

వాల్ న‌ట్స్ గ‌ర్భిణీ స్త్రీల‌కు ఎంతో మేలు క‌లిగిస్తాయి. ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ వ‌ల్ల పుట్ట‌బోయే బిడ్డ మెద‌డు అభివృద్ధికి స‌హాయ‌ప‌డుతాయి. అయితే డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు వాల్ న‌ట్స్ తీసుకుంటే మీకు, పుట్ట‌బోయే బిడ్డ‌కు మంచిది.

Updated On 23 March 2023 3:42 AM GMT
subbareddy

subbareddy

Next Story