Dry Fruits | మ‌నం ఆరోగ్య‌క‌రంగా ఉండాలంటే.. ప్ర‌తి రోజు అర గంట పాటు వ్యాయామం త‌ప్ప‌నిస‌రి. దీనికి తోడు మంచి ఆహారం కూడా తీసుకోవాలి. అప్పుడే ప‌ది కాలాల పాటు ఆరోగ్యంగా జీవించే అవ‌కాశం ఉంటుంది. ఖ‌నిజాలు, ప్రోటీన్స్, ఫైబ‌ర్, విట‌మిన్స్ పుష్క‌లంగా దొరికే ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డ‌ట‌మే కాకుండా, ఇమ్యూనిటీ(రోగ నిరోధ‌క శ‌క్తి) కూడా పెరుగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం కూడా దూరం అవుతుంది. బ‌రువు కూడా త‌గ్గుతారు. క్యాన్స‌ర్‌తో పోరాడే సామ‌ర్థ్యం కూడా […]

Dry Fruits | మ‌నం ఆరోగ్య‌క‌రంగా ఉండాలంటే.. ప్ర‌తి రోజు అర గంట పాటు వ్యాయామం త‌ప్ప‌నిస‌రి. దీనికి తోడు మంచి ఆహారం కూడా తీసుకోవాలి. అప్పుడే ప‌ది కాలాల పాటు ఆరోగ్యంగా జీవించే అవ‌కాశం ఉంటుంది. ఖ‌నిజాలు, ప్రోటీన్స్, ఫైబ‌ర్, విట‌మిన్స్ పుష్క‌లంగా దొరికే ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డ‌ట‌మే కాకుండా, ఇమ్యూనిటీ(రోగ నిరోధ‌క శ‌క్తి) కూడా పెరుగుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం కూడా దూరం అవుతుంది. బ‌రువు కూడా త‌గ్గుతారు. క్యాన్స‌ర్‌తో పోరాడే సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంది.

డ్రైఫ్రూట్స్‌ను రాత్రి స‌మ‌యంలో నాన‌బెట్టి, పొద్దున్నే బ‌రికడుపున తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి స‌రైన స్థాయిలో పోష‌కాలు అందుతాయి. అప్ప‌టిక‌ప్పుడు శ‌క్తి కూడా వ‌చ్చేస్తుంది. మ‌రి ఏయే డ్రైఫ్రూట్స్ నాన‌బెట్టి తింటే మంచిదో ఒకసారి ప‌రిశీలిద్దాం..

బాదం..

బాదంలో పోష‌కాలు పుష్క‌లంగా ల‌భిస్తాయి. బాదంలో ఫ్యాటీ యాసిడ్స్, మాంగ‌నీస్, ఫోలేట్, ఐర‌న్, విట‌మిన్ డీ, ఈ, బీ 12 పుష్క‌లంగా ఉంటాయి. పోష‌కాలు అధికంగా ఉన్న రెండు నుంచి నాలుగు బాదం గింజ‌న‌ల‌ను రాత్రి పూట నాన‌బెట్టి పొద్దున్నే తిన‌డం వ‌ల‌న‌.. మెద‌డు క‌ణాల్లో ప్రోటీన్లు ఎక్కువ‌గా అబ్జార్వ్ చేసుకుంటుంది. అంతేకాకుండా బాదంలో ఉండే ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ ఆరోగ్యానికి చాలా మంచిది.

జీడిపప్పు..

జీడిప‌ప్పు తిన‌డానికి రుచిగా ఉండ‌ట‌మే కాకుండా, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. జీడిప‌ప్పులో కొలెస్ట్రాల్ ఉండ‌దు. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది జీడిప‌ప్పు. బ‌రువు త‌గ్గేందుకు జీడిపప్పు ఉప‌యోగ‌పడుతుంది. ఖాళీ క‌డుపుతో ఉన్న‌ప్పుడు జీడిప‌ప్పును తిన‌డం వ‌ల్ల ఆక‌లి పెద్ద‌గా అనిపించ‌దు.

ఎండు ద్రాక్ష‌..

ఎండు ద్రాక్ష తిన‌డం వ‌ల్ల హెయిర్ ఫాల్ నుంచి విముక్తి పొందొచ్చు. మ‌రి ముఖ్యంగా మ‌హిళ‌లు ఎదుర్కొనే రుతుక్ర‌మం, ఆ స‌మ‌యంలో వ‌చ్చే నొప్పి వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. ముఖ్యంగా న‌ల్ల ద్రాక్ష‌.. జీర్ణ స‌మ‌స్య‌ల్ని దూరం చేస్తుంది. న‌ల్ల ద్రాక్ష‌లో ఉండే పాలిఫెనాల్స్, ఫైటో న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. కంటి స‌మ‌స్య‌ల్ని దూరం చేస్తాయి. ఫ్రీ రాడికల్ డ్యామేజ్, కంటి శుక్లాల సమస్య కూడా దూరమవుతుంది.

వాల్ న‌ట్స్..

వాల్ న‌ట్స్ నాన‌బెట్టి తిన‌డం వ‌ల్ల మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. వాల్ న‌ట్స్‌ను పిల్ల‌ల‌కు తినిపించ‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. చ‌ద‌విన‌వన్నీ గుర్తుండే అవ‌కాశం ఉంటుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చినప్పుడు వీటిని తినడం వల్ల మతిమరుపు సమస్యలు కాస్తా తగ్గుతాయి.

ఫిగ్స్ (అత్తి పండ్లు)

అత్తి పండ్లు తిన‌డానికి చాలా రుచిగా ఉంటాయి. డ్రై ఫిగ్స్‌ను ఐస్ క్రీమ్స్, స్వీట్ల‌లో వినియోగిస్తారు. అత్తిపండ్లను రాత్రి నాన‌బెట్టి ఉద‌యాన్నే తిన‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి విముక్తి పొందొచ్చు. ఫిగ్స్ గ‌ర్భిణుల‌కు చాలా మేలు క‌లిగిస్తాయి. గ‌ర్భం ధ‌రించిన స‌మ‌యంలో వ‌చ్చే మ‌ల‌బ‌ద్దకం దూర‌మ‌వుతుంద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Updated On 30 Jan 2023 9:26 AM GMT
subbareddy

subbareddy

Next Story