విధాత: పాము.. ఆ పేరు వింటేనే ఒళ్లంతా జలదరిస్తోంది. ప్రత్యక్షంగా పాములను చూశామంటే గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. అలాంటి పాముల నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాం. అవసరమైతే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించి.. ఆ పాములను పట్టిస్తాం.
ఇక పాములను పట్టిన అనంతరం వాటిని ఓ బ్యాగులో వేసుకుని, అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేస్తాం. అయితే ఈ పాముల కుప్పకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గ్రీన్ కలర్ బ్యాగులో ఓ వ్యక్తి పాములను పట్టుకుని అటవీ ప్రాంతానికి తీసుకొచ్చాడు.
ఇక ఆ సంచి ముడి విప్పి అక్కడ గుమ్మరించడంతో ఆ పాములు పరుగో పరుగో అంటూ చెట్ల పొదల్లోకి దూరాయి. వాటిని చెల్లాచెదురుగా చేసేందుకు తన చేత్తో పాములను టచ్ చేశాడు ఆ స్నేక్ క్యాచర్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్లో ఉంది.