HomelatestHeart Attack | టీనేజ్ పిల్ల‌ల్లో స‌డ‌న్‌గా గుండెపోటు.. జాగ్రత్త పడాల్సిందే

Heart Attack | టీనేజ్ పిల్ల‌ల్లో స‌డ‌న్‌గా గుండెపోటు.. జాగ్రత్త పడాల్సిందే

Heart Attack |

విధాత: టీనేజ్ పిల్ల‌ల్లో స‌డ‌న్‌గా గుండెపోటు వ‌చ్చి మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌టంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న నెల‌కొంది. తాజాగా గ‌త వారం రోజుల్లో గ్రేట‌ర్ నోయిడాలో ఆడుకుంటూ ఓ 15 ఏళ్ల బాలుడు చ‌నిపోగా.. తెలంగాణ‌లో 16 ఏళ్ల మ‌రో బాలుడు స‌డ‌న్ కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ గుండెపోట్లు వృద్దుల్లోనూ మ‌ధ్య వ‌య‌స్కుల్లోనూ చూడ‌గా కొవిడ్ త‌ర్వాతి నుంచి టీనేజ్ పిల్ల‌ల్లోనూ ఈ స‌మ‌స్య త‌లెత్తుతోంది. స‌డెన్ కార్డియాక్ అరెస్ట్ (ఎస్ సీ ఏ ) అనేది యువ‌కుల్లో త‌క్కువే అయిన‌ప్ప‌టికీ ఎప్పుడూ విన‌నిదేం కాద‌ని డాక్ట‌ర్ మహీంద‌ర్ సింగ్ ధ‌లీవాల్ అనే హృద్రోగ నిపుణుడు పేర్కొన్నారు.

స‌డెన్ కార్డియాక్ అరెస్టు అంటే..

గుండె హఠాత్తుగా కొట్టుకోవ‌డం మానేసినా లేదా నెమ్మ‌దించినా ఎస్‌సీఏ రావ‌డానికి అవ‌కాశం ఉంది. ఆ ల‌క్ష‌ణాలు క‌నిపించిన గంట వ్య‌వ‌ధిలో స‌రైన చికిత్స అంద‌క‌పోతే మృత్యువు స‌మీపిస్తుంది. ప్ర‌తీ ల‌క్ష మంది పిల్ల‌ల్లో ముగ్గురు ఇలా ఎస్ సీ ఏతో మ‌ర‌ణిస్తుండ‌గా.. అదే పెద్ద వారిలో ప్ర‌తి ల‌క్ష మందిలో 135 మంది ప్రాణాలు కోల్పోతున్నార‌ని నిపుణులు చెబుతున్నారు.

Viral Video | గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసా..? లైవ్‌లో ఎప్పుడైనా చూశారా!

కొవిడ్‌దే పాప‌మా..

కొవిడ్‌తోనే ఈ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌న‌డానికి ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ.. ఆ సంక్షోభం త‌ర్వాతే గుండెపోటు మ‌ర‌ణాలు ఎక్కువ‌య్యాయ‌న్న‌ది స్ప‌ష్టం. అయితే స్వ‌ల్ప స్థాయి కొవిడ్ ఇన్ఫెక్ష‌న్ సైతం గుండె ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తుంద‌ని ప‌రిశోధ‌కులు న‌మ్ముతున్నారు.

అయితే ఇప్పుడు యువ‌తలో వ‌స్తున్న గుండెపోట్ల‌కు జీవ‌న‌శైలే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని డాక్ట‌ర్ అప‌ర్ణా జైశ్వాల్ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే కొవిడ్ కూడా మ‌న గుండెను బ‌లహీన‌ప‌రిచింద‌ని చెప్ప‌డంలో సందేహం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇది హెచ్చ‌రికే

ప్ర‌స్తుతం యువ‌త‌కి గుండెపోటు వార్త‌లు అడ‌పా ద‌డ‌పా వినిపిస్తున్నా.. రానున్న కాలంలో 25 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య యువ‌త‌కు గుండెపోటు సాధార‌ణంగా మారిపోనుంద‌ని హృద్రోగ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. నెల‌లో ఆ ఏజ్ గ్రూప్‌కు చెందిన న‌లుగురు లేదా ఐదుగురు గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో త‌మ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నార‌ని డాక్ట‌ర్ మున్నాదాస్ వెల్ల‌డించారు. ‘మ‌నం క‌చ్చితంగా జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రాన్ని ఈ ట్రెండ్ సూచిస్తోంది. హైస్కూల్స్‌, కాలేజీలు, ముఖ్యంగా స్పోర్ట్స్ కాలేజీల్లో స్క్రీనింగ్ ప‌రీక్ష‌ల‌ను విరివిగా చేయించాలి’ అని సూచించారు.

Heart | సీసాలో.. త‌న గుండెను చూసుకుని యువతి ఉద్వేగం

ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు త‌ప్ప‌నిస‌రి

కార్డియార్ అరెస్టు మ‌ర‌ణాల‌ను నిలువ‌రించాలంటే కొన్ని జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి. హృద్రోగ నిపుణులు తెలిపిన ప్ర‌కారం.. ముందుగా మ‌న కుటుంబంలో స‌మీప త‌రంలో ఎవ‌రికైనా గుండె స‌మ‌స్య‌లు ఉన్నాయేమో తెలుసుకోవాలి. ఉంటే వెంట‌నే వైద్యుల్ని సంప్ర‌దించాలి.

అలాగే పాఠ‌శాలల్లో కాలేజీల్లో వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థుల వైద్య రికార్డును తీసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌రింగ్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఆట‌ను కెరీర్‌గా ఎంచుకోవాల‌నుకుంటే వైద్యుడి నుంచి పూర్తిస్థాయి ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్‌ను పొందాలి అని వెల్ల‌డించారు

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular