Heart | 15,000 మందిపై పరిశీలన ఆమ్‌స్టర్‌డ్యామ్ : శారీరకంగా శ్రమ కలిగే పనుల్లో చురుగ్గా పాల్గొంటుంటే గుండెకు సంబంధించిన ప్రమాదాలను నివారించవచ్చని, గుండెపోటుతో పాటు హృదయ సంబంధిత ఇతర అనే సమస్యలను తగ్గించవచ్చని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీనికోసం 15,000 మంది ఆరోగ్య పరిస్థితిని, అలవాట్లను అధ్యయనం చేశారు. ఆ నివేదికను నెదర్‌ల్యాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో జరిగిన యూరోపియన్ సైన్స్ కాన్ఫరెన్స్-2023లో ప్రవేశ పెట్టారు. ప్రపంచంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో హృదయ […]

Heart |
15,000 మందిపై పరిశీలన
ఆమ్‌స్టర్‌డ్యామ్ : శారీరకంగా శ్రమ కలిగే పనుల్లో చురుగ్గా పాల్గొంటుంటే గుండెకు సంబంధించిన ప్రమాదాలను నివారించవచ్చని, గుండెపోటుతో పాటు హృదయ సంబంధిత ఇతర అనే సమస్యలను తగ్గించవచ్చని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీనికోసం 15,000 మంది ఆరోగ్య పరిస్థితిని, అలవాట్లను అధ్యయనం చేశారు. ఆ నివేదికను నెదర్‌ల్యాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో జరిగిన యూరోపియన్ సైన్స్ కాన్ఫరెన్స్-2023లో ప్రవేశ పెట్టారు.
ప్రపంచంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో హృదయ సంబంధిత ఇబ్బందులు ఉన్నాయి. ధమనుల్లో అవాంఛిత కొవ్వు పోగుపడి.. హఠాత్తుగా గుండెపోట్లు, వాటితో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కనీసం 4 కోట్ల మంది ఏటా గుండెపోటుతో మరణిస్తున్నారు. యూరప్‌లో ప్రతి ముగ్గురిలో ఒకరు తమ జీవిత కాలంలో కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కొంటున్నారని అధ్యయనంలో వెల్లడైంది.
ఇదే కాకుండా తమ స్నేహితుల్లో, లేదా తమ కుటుంబంలో ఎవరికైనా స్ట్రోక్ వచ్చి వుంటే అది తమకూ రావొచ్చనే భావన వల్ల యూరప్‌లో గుండె పోట్లను ఐదు రెట్లు పెంచుతున్నది. ఈ అధ్యయనం శరీర ఫిట్‌నెస్‌కు, కొలెస్ట్రాల్ సమస్యకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నది. ఈ అధ్యయనంలో దాదాపు 15,450 మంది పాల్గొన్నారు. వారిలో ఎవరికీ కొలెస్ట్రాల్ సమస్యలు లేవు. వీరందరికీ శారీరక శ్రమ కోసం ట్రెడ్‌మిల్‌పై నడిపించారు. 2003 నుండి 2012మధ్య కాలంలో ఈ అధ్యయనం సాగింది. అప్పటికి వీరి సగటు వయస్సు 55 సంవత్సరాలు. వీరిలో 59 మంది శాతం పురుషులు.
ఫిట్‌నెస్ ఇలా అంచనా వేశారు
అధ్యయనంలో భాగస్వాములైనవారి ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి ఎక్సర్ సైజ్‌ల వేగాన్ని, ట్రెడ్‌మిల్‌పై నడకను మూడు నిమిషాలకోసారి పెంచుతూ.. గుండెపై ప్రభావం పడే విధంగా చూశారు. తద్వారా వారు ఖర్చు చేసిన శక్తిని అంచనా వేశారు. ఖర్చు చేసిన శక్తిని మెటబొలిక్ ఈక్వలెంట్స్ లలో లెక్క గట్టారు. గుండెకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలు ప్రధానంగా మూడు రకాలు. అభ్యర్ధులను కూడా అవే మూడు రకాలుగా విభజించి ప్రయోగాలు చేశారు.
ఈ ప్రయోగాల్లో వయస్సు, మహిళలు-పురుషులు అనే తేడాలు, కొలెస్ట్రాల్ స్థాయిలు, మూత్రపిండాల పనితీరు, ప్రాథమిక గుండెపోటు సూచనలు, హైపర్ టెన్షన్, వాడుతున్న మందులు.. వీటన్నింటి మధ్య పరస్పర సంబంధాలను పరిశీలించారు. 137 నెలలు సాగిన పరిశీలనా కాలంలో 515 మంది (3.3శాతం)లో గుండె పోటు వచ్చే ప్రమాదాన్ని 12 శాతం వరకు తగ్గించింది. 8 శాతం మందికి కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించింది. 14 శాతం గుండె, ఇతర సమస్యల ప్రమాదాన్ని తగ్గించింది.
ఇదొక విస్తృత అధ్యయన కార్యక్రమమని, కచ్చితమైన గణాంకాల ద్వారా శరీర ఫిట్‌నెస్‌ను అంచనా వేసేందుకు 11 ఏళ్లుగా తాము నిరంతర కృషి చేశామని అధ్యయన ముఖ్యకర్త, తైవాన్‌లోని నేషనల్ యాంగ్ మింగ్ చియాయోటుంగ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సైయిహైసిన్ సుంగ్ చెప్పారు. శారీరక శ్రమతో కొలెస్ట్రాల్‌ను, తద్వారా గుండెపోటు సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైందని ఆయన తెలిపారు.
