విధాత: తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో నిన్న రాత్రి భారీ వ‌ర్షం కురిసిన సంగ‌తి తెలిసిందే. కుండ‌పోత వ‌ర్షానికి న‌గ‌రంలోని ప‌లు బస్తీలు చెరువుల్లా మారాయి. మోకాళ్ల లోతు నీరు ప్ర‌వ‌హించ‌డంతో.. ఆయా బ‌స్తీల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహ‌న‌దారులు అయితే ముందుకు క‌ద‌ల్లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. న‌గ‌రంలోని బోర‌బండ ఏరియాలో వ‌ర‌ద పోటెత్తింది. వ‌ర‌ద నీటిలో ఓ ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు కొట్టుకు పోయాడు. అత‌ని బైక్ కూడా వ‌ర‌ద నీటిలో గ‌ల్లంతైంది. ఆ వ్య‌క్తిని […]

విధాత: తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో నిన్న రాత్రి భారీ వ‌ర్షం కురిసిన సంగ‌తి తెలిసిందే. కుండ‌పోత వ‌ర్షానికి న‌గ‌రంలోని ప‌లు బస్తీలు చెరువుల్లా మారాయి. మోకాళ్ల లోతు నీరు ప్ర‌వ‌హించ‌డంతో.. ఆయా బ‌స్తీల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహ‌న‌దారులు అయితే ముందుకు క‌ద‌ల్లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

న‌గ‌రంలోని బోర‌బండ ఏరియాలో వ‌ర‌ద పోటెత్తింది. వ‌ర‌ద నీటిలో ఓ ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు కొట్టుకు పోయాడు. అత‌ని బైక్ కూడా వ‌ర‌ద నీటిలో గ‌ల్లంతైంది. ఆ వ్య‌క్తిని స్థానికులు గ‌మ‌నించి, ప్రాణాల‌తో కాపాడారు. పార్కింగ్ చేసిన కార్లు వ‌ర‌ద ఉధృతికి కొట్టుకుపోయాయి.

గ‌త కొద్ది రోజుల నుంచి హైద‌రాబాద్ న‌గ‌రంలో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. నిన్న రాత్రి హైద‌రాబాద్ న‌గ‌రంలో 300 మిల్లిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

Updated On 13 Oct 2022 4:42 AM GMT
subbareddy

subbareddy

Next Story