విధాత, ఆంధ్రప్రదేశ్ నుండి సూర్యాపేటకు అక్రమంగా రవాణా అవుతున్న 5200కిలోల నల్లబెల్లం, 300కిలోల పటిక ను పట్టుకుని ఒకరిని రిమాండ్ చేసినట్లుగా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంభూ ప్రసాద్ గారు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి సూర్యాపేటకు నల్ల బెల్లం సరఫరా జరుగుతుందన్న సమాచారంతో ఎన్‌ఫోర్స్ మెంట్ సిబ్బంది దురాజ్ పల్లి వద్ద తనిఖీలు నిర్వహించగా మహీంద్రా బొలెరో వాహనంలో 24 బస్తాలు నల్లబెల్లం(1200 కిలోలు), 100 కిలోల పటికతో […]

విధాత, ఆంధ్రప్రదేశ్ నుండి సూర్యాపేటకు అక్రమంగా రవాణా అవుతున్న 5200కిలోల నల్లబెల్లం, 300కిలోల పటిక ను పట్టుకుని ఒకరిని రిమాండ్ చేసినట్లుగా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంభూ ప్రసాద్ గారు తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి సూర్యాపేటకు నల్ల బెల్లం సరఫరా జరుగుతుందన్న సమాచారంతో ఎన్‌ఫోర్స్ మెంట్ సిబ్బంది దురాజ్ పల్లి వద్ద తనిఖీలు నిర్వహించగా మహీంద్రా బొలెరో వాహనంలో 24 బస్తాలు నల్లబెల్లం(1200 కిలోలు), 100 కిలోల పటికతో సూర్యాపేటకు చెందిన లింగయ్య అనే వ్యక్తిని పట్టుకున్నారు.

తదుపరి విచారణలో ఈ బెల్లాన్ని విజయవాడలో ఒక గోదాంలో భద్రపరిచి విడతల వారీగా తెస్తున్నాడన్న సమాచారం మేరకు మరో బృందం సిబ్బంది విజయవాడ వెళ్ళి గోదాములోని 80 బస్తాల నల్ల బెల్లం (4000 కిలోలు), నాలుగు బస్తాల పట్టిక (200 కిలోలు )సీజ్ చేసి ఆ సరుకును తీసుకొని సూర్యాపేటకు తీసుకొని వచ్చారు.

మొత్తం 5200 కిలోల నల్ల బెల్లం, 300కిలోల పటిక , మరియు వాహనాన్ని సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు భరత్ భూషణ్, నాగార్జున రెడ్డి, రాఘవీణ ఎస్ఐలు శివకృష్ణ, రాఘవేందర్ మరియు అప్సర్ అలీ ఆయుబ్, శ్రీను, శేఖర్ రెడ్డి నాగరాజు, రమేష్, బ్రహ్మం, చందన తదితరులు పాల్గొన్నారు.

Updated On 24 Nov 2022 12:27 PM GMT
krs

krs

Next Story