విధాత: దేశంలో తొలిసారిగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ తయారు చేసిన హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్లు రోడ్డెక్కనున్నాయి. మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుగా భారతీయ ఆటోమొబైల్ నియంత్రణ సంస్థ హోమోలోగేషన్ సర్టిఫికెట్ మంజూరు చేసినట్లు మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్స్ లిమిటెడ్ ప్రకటించింది. కేంద్ర మోటార్ వాహన నిబంధనలకు అనుగుణంగా ఒలెక్ట్రా 6‘4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ ను తయారు చేశారు. ఈ టిప్పర్ దేశ రహదారులకు అనువుగా ఉన్నాయా లేదా అనేది పరీక్షించేందుకు పర్వత […]

విధాత: దేశంలో తొలిసారిగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ తయారు చేసిన హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్లు రోడ్డెక్కనున్నాయి. మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుగా భారతీయ ఆటోమొబైల్ నియంత్రణ సంస్థ హోమోలోగేషన్ సర్టిఫికెట్ మంజూరు చేసినట్లు మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్స్ లిమిటెడ్ ప్రకటించింది.

కేంద్ర మోటార్ వాహన నిబంధనలకు అనుగుణంగా ఒలెక్ట్రా 6‘4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ ను తయారు చేశారు. ఈ టిప్పర్ దేశ రహదారులకు అనువుగా ఉన్నాయా లేదా అనేది పరీక్షించేందుకు పర్వత ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు, మైనింగ్, క్వారీతో సహా క్లిష్టమైన రహదారులపై నడిపించారు.

ఎంఈఐఎల్ ఛైర్మన్ కెవి.ప్రదీప్ మాట్లాడుతూ, భారత దేశంలో ఎలక్ట్రికల్ హెవీ వెహికల్ విభాగంలో ఒలెక్ట్రా ప్రధాన పాత్ర పోషిస్తసుందని, తమ సంస్థలో తయారైన ఈ టిప్పర్ దేశంలోనే మొట్ట మొదటి సర్టిఫైడ్ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ గా నిలిచిందన్నారు.

ఈ టిప్పర్ల రాకతో నిర్మాణ, మౌలిక సదుపాయాలు, మైనింగ్, క్వారీ రంగాలలో గణనీయమైన మార్పులు రానున్నాయన్నారు. పని ప్రదేశాలకు భారీ వస్తువులు రవాణా చేసుకోవడానికి, రవాణా అవసరాలకు పెద్ద పరిమాణంలో ఉండే వాహనాలు కావాలనుకునే వారికి ఈ టిప్పర్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. డీజిల్ వాహనాలతో పోల్చితే ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ తో నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయన్నారు. డీజిల్ వాహనాల మాదిరి శబ్ధాలు రావని, కాలుష్యం కూడా ఉండదని ప్రదీప్ తెలిపారు.

Updated On 1 March 2023 2:33 PM GMT
krs

krs

Next Story