Hero Karizma XMR | ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ హీరో మోటోకార్ప్‌ మిడ్‌ రేంజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ కరిజ్మాను ఇటీవల మళ్లి మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పటికే కంపెనీ ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించగా.. కరిజ్మా ఎక్స్ఎంఆర్ యూనిట్స్‌ డెలివరీకి ఏర్పాట్లు చేస్తున్నది. తొలి యూనిట్‌ జైపూర్‌లోని ప్లాంట్‌ నుంచి బయటకు రానున్నాయి. కొద్దివారాల్లోనే డెలివరీలు ప్రారంభించే అవకాశాలున్నాయని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ద్విచక్ర వాహనదారులు రూ.3వేలు చెల్లించి బైక్‌ ప్రీ బుకింగ్‌ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. […]

Hero Karizma XMR |

ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ హీరో మోటోకార్ప్‌ మిడ్‌ రేంజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ కరిజ్మాను ఇటీవల మళ్లి మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పటికే కంపెనీ ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించగా.. కరిజ్మా ఎక్స్ఎంఆర్ యూనిట్స్‌ డెలివరీకి ఏర్పాట్లు చేస్తున్నది.

తొలి యూనిట్‌ జైపూర్‌లోని ప్లాంట్‌ నుంచి బయటకు రానున్నాయి. కొద్దివారాల్లోనే డెలివరీలు ప్రారంభించే అవకాశాలున్నాయని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ద్విచక్ర వాహనదారులు రూ.3వేలు చెల్లించి బైక్‌ ప్రీ బుకింగ్‌ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

బైక్‌లో 210 సీసీ సింగిల్‌ సిలిండర్‌ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కంపెనీ ఇచ్చింది. బైక్‌ ఆరు స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో దీన్ని లాంచ్ చేయగా.. 25.5 పీఎస్‌ పవర్, 7250 ఆర్పీఎం వద్ద 20.4 ఎన్ఎం టార్క్‌ను అందించే సామర్థ్యం ఉన్నది.

బైక్‌ టాప్‌ స్పీడ్‌ 143 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. బైక్ డిజైన్ చూసేందుకు ఎల్ఈడీ హెడ్‌లైట్ ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ మాదిరిగా కనిపిస్తుంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్, స్ట్రాంగ్ ఫ్యూయల్ ట్యాంక్, స్ల్పిట్‌ సీట్స్‌, అల్లాయ్‌ వీల్స్‌, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తదితర ఫీచర్లున్నాయి ఇందులో.

బైక్‌ ధర ఎంతంటే..?

కొత్త హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ ఎక్స్ షోరూం ధర రూ.1.82లక్షలు నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.10వేలు డిస్కౌంట్‌ ఇస్తున్నది. డిస్కౌంట్‌ పోను రూ.1.72లక్షలకే బైక్‌ ఇవ్వనున్నట్లు కంపెనీ గతంలో ప్రకటించింది. ఈ బైక్ యమహా ఆర్15 వీ4, బజాజ్ పల్సర్ ఆర్ఎస్200, సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ 250, కేటీయం ఆర్సీ 200 తదితర మోడల్స్‌తో బైక్‌ పోటీపడనున్నది.

మూడు రంగుల్లో.. బ్లూటూత్‌ కనెక్టివిటీతో..

హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ మూడు రంగులలో అందుబాటులో ఉండనున్నది. మాట్ ఫాంటోమ్‌ బ్లాక్, టర్బో రెడ్‌, ఐకానిక్‌ ఎల్లో వేరియంట్‌లో రానున్నాయి. ఈ సెగ్మెంట్‌లో చాలా ఫీచర్లు ఉన్న తొలి బైక్ ఇదే. ఇందులో అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, టర్న్ బై టర్న్ నావిగేషన్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఎల్‌సీడీ డాష్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఉన్నాయి.

బైక్‌లో లేయర్డ్ డిజైన్‌తో ఫెయిరింగ్, డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్, అప్‌స్వెప్ట్, షార్ప్ డిజైన్‌తో కూడిన టెయిల్ సెక్షన్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ సైతం ఉన్నాయి. బ్లూటూత్‌ కనెక్టివిటీ ఉండడంతో మొబైల్‌కు ఏవైనా కాల్స్‌ వచ్చిన సందర్భంలో స్క్రీన్‌పై అలెర్ట్‌ సైతం కనిపించనున్నాయి.

Updated On 16 Sep 2023 4:14 AM GMT
cm

cm

Next Story