Rana Naidu, Prabhas, Maheshbabu విధాత‌: యంగ్ రెబెల్ స్టార్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన ప్రత్యేకతను చాటాడు ప్రభాస్ (Prabhas). బాహుబలి (Bahubali) సినిమా తర్వాత నుంచి ఆల్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. తెలుగులో మరో అగ్ర హీరోగా గుర్తింపు పొందాడు. మహేష్ బాబు. బాల‌నటునిగా సినిమాల్లోకి తెరంగేట్రం చేసి సూపర్ స్టార్ రేంజ్ సంపాదించుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమాలోకి వచ్చిన మహేష్ […]

Rana Naidu, Prabhas, Maheshbabu

విధాత‌: యంగ్ రెబెల్ స్టార్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన ప్రత్యేకతను చాటాడు ప్రభాస్ (Prabhas). బాహుబలి (Bahubali) సినిమా తర్వాత నుంచి ఆల్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. తెలుగులో మరో అగ్ర హీరోగా గుర్తింపు పొందాడు.

మహేష్ బాబు. బాల‌నటునిగా సినిమాల్లోకి తెరంగేట్రం చేసి సూపర్ స్టార్ రేంజ్ సంపాదించుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమాలోకి వచ్చిన మహేష్ బాబు (Mahesh babu)కు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ ఇద్దరు అగ్ర హీరోలు తెలియని వారు ఉండరు. కానీ ప్రభాస్ అంటే తెలియని వారు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు రానా ద‌గ్గుబాటి.

‘లీడర్‌’ (Leader)తో ఎంట్రీ ఇచ్చి అప్పుడప్పుడు హిందీ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు రానా (Rana). ఇక ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తన బాబాయి హీరో వెంకటేష్‌ (Venkatesh)తో కలిసి ‘రానా నాయుడు’ (Rana nayudu) అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇది క్రైమ్ డ్రామాగా రూపొందింది.

అమెరికన్ సిరీస్ రే డోనోవర్ కు ఇండియన్ అడాప్షన్‌గా రానుంది. రానా నాయుడు వెబ్ సిరీస్‌ను హిందీతో పాటు తెలుగు తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. తాజాగా రానా కొన్నేళ్ల కిందట సౌత్ సినిమాలంటే నార్త్‌లో ఎలా ఉండేదో గుర్తు చేసుకున్నాడు.

అది బాహుబ‌లి షూటింగ్ జరుగుతున్న రోజులు. నేను ఒక ఫ్రెండ్‌ని కలిశాను. నేను బాహుబలి సినిమాలో చేస్తున్నట్టు చెప్పాను. టైటిల్ రోల్ ఎవరు పోషిస్తున్నారని అడగగా.. ప్రభాస్ అని చెప్పాను. ప్రభాస్ ఎవ‌రు అని అడిగాడు? నాకు ఏం చెప్పాలో అర్థం కాక ప్రభాస్ చేసిన కొన్ని సినిమాల పేర్లు చెప్పాను.

వాటిలో అతను ఏ ఒక్క సినిమా చూడలేదు ఏమో.. నాకు వాళ్ళు ఎవరూ తెలియదు. నాకు తెలిసింది ఒక చిన్ను భర్త మాత్రమే అని రానా తెలిపాడు. అసలు ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు. కాసేపు ఆశ్చర్యంలో మునిగి పోయాను. ఆ తర్వాత గుర్తుకు వచ్చింది చిన్ను అంటే న‌మ్ర‌తా శిరోద్క‌ర్.

చిన్నూ భర్త అంటే మహేష్ బాబు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. మహేష్ బాబు వాళ్లకు అలా తెలుసా? అలా గుర్తుంచుకున్నారా? అని అర్థమైంది. ఒక నాలుగైదు రోజులాగు.. మా సైన్యం ఇక్కడ దిగుతుంది.. అప్పుడు తెలుగు హీరోలు అందరూ తెలుస్తారని నా ఫ్రెండ్‌కి చెప్పి వ‌చ్చాను అన్నాడు రానా ద‌గ్గుబాటి.

Updated On 8 March 2023 2:24 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story