విధాత: కోలీవుడ్‌ నటుడు విజయ్ ఆంటోని ప్రమాదం నుంచి సినీ పరిశ్రమ తేరుకోకముందే మరో షాక్‌ తగిలింది. మరో ప్రముఖ నటుడు ప్రమాదానికి గురయ్యాడు. బిచ్చగాడు హీరో విజయ్‌ సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తున్నది. ఆయన పరిస్థితి ఆందోళనక కరంగా ఉన్నట్లు సమాచారం. విజయ్‌ హీరోగా బిచ్చ‌గాడు-2 సినిమా షూటింగ్‌ మలేషియాలో జరుగుతున్నది. ఆ సందర్భంగా.. బోట్‌ సీన్‌ షూట్‌ చేస్తున్న సమయంలో విజయ్‌ ఉన్న బోట్‌ అదుపు తప్పి ఎదురుగా ఉన్న […]

విధాత: కోలీవుడ్‌ నటుడు విజయ్ ఆంటోని ప్రమాదం నుంచి సినీ పరిశ్రమ తేరుకోకముందే మరో షాక్‌ తగిలింది. మరో ప్రముఖ నటుడు ప్రమాదానికి గురయ్యాడు. బిచ్చగాడు హీరో విజయ్‌ సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తున్నది. ఆయన పరిస్థితి ఆందోళనక కరంగా ఉన్నట్లు సమాచారం.

విజయ్‌ హీరోగా బిచ్చ‌గాడు-2 సినిమా షూటింగ్‌ మలేషియాలో జరుగుతున్నది. ఆ సందర్భంగా.. బోట్‌ సీన్‌ షూట్‌ చేస్తున్న సమయంలో విజయ్‌ ఉన్న బోట్‌ అదుపు తప్పి ఎదురుగా ఉన్న పడవను ఢీ కొట్టింది. దీంతో ఆయన బోట్‌నుంచి ఎగిరి పడిపోయాడు.

వెంటనే అతన్ని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతన్ని మలేషియా నుంచి చెన్నైకు తరలించి చకిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే.. అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు అతని భార్య ఫాతిమా తెలిపారు.

ఈ ప్రమాదంలో అతని ముఖానికి తీవ్ర గాయాలయ్యాయని షూటింగ్‌ యూనిట్‌లోని ఓ వ్యక్తి తెలిపాడు. ఈ ప్రమాదంలో అతని దవడ ఎముక, కొన్ని దంతాలు కూడా విరిగిపోయినట్లు తెలుస్తున్నది. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న విజయ్‌ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు కోరుకొంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమ కూడా అతని ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే వెంటనే మలేసియా చేరుకున్న విజయ్ భార్య, కుటుంబ సభ్యులు హస్పిటల్ కు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు బుధవారం సాయంత్రమే కుటుంబ సభ్యులు విజయ్ ని చెన్నైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

విజయ్ కి పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని, స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, దాదాపుగా కోలుకున్నారని, సినిమా షూటింగ్ మాత్రం వాయిదా పడింది సన్నిహితులు తెలిపారు.

Updated On 19 Jan 2023 2:47 PM GMT
krs

krs

Next Story