విధాత: ఇటీవల హీరోయిన్లు విలన్లను ప్రేమించడం, పెళ్ళికి రెడీ అవుతున్న తీరు నెట్టింట వైరల్ గా మారుతుంది. తాజాగా కన్నడ హీరోయిన్ హరిప్రియ కేజిఎఫ్ విలన్ వశిష్టా సింహాతో ప్రేమ పెళ్లికి రెడీ అయిపోయింది. తాజాగా ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేసుకున్నారు.
గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట సడన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఇప్పుడు ఇదే తరహాలో మరో హీరోయిన్ విలన్ తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమమ్ ఫేమ్ నవీన్ పాలి నటించిన ఓ మలయాళ మూవీతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది ఐశ్వర్య లక్ష్మి.
విశాల్ నటించిన యాక్షన్ మూవీతో తమిళంలోకి అరంగేట్రం చేసింది. ఇటీవల సత్యదేవ్ హీరోయిన్ గా నటించిన గాడ్సే మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ పార్ట్1లో నటించిన ఈమె పార్ట్ 2 లో కూడా నటిస్తోంది. గత కొంతకాలంగా ఈమె ఓ విలన్‌తో ప్రేమలో ఉందట.
తాజాగా సోషల్ మీడియా వేదికగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఆ విలన్ తో ఉన్న ఫోటోని షేర్ చేసిన ఐశ్వర్య లక్ష్మి. అతనితో ప్రేమలో ఉందని జరుగుతున్న ప్రచారం నిజమేనని స్పష్టం చేసింది. ఈ ఫోటోకు లవ్ సింబల్ ని పోస్ట్ చేసింది. తాను ప్రేమలో ఉన్నానని క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకీ ఐశ్వర్య లక్ష్మి డేటింగ్ చేస్తున్న విలన్ ఎవరో కాదు తమిళ సహాయ నటుడు అర్జున్ దాస్.
లోకేష్ కనకరాజు తెరకెక్కించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాల్లో విలన్ ఛాయలున్న ప్రతినాయక పాత్రలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కప్పెలా ఆధారంగా తెలుగులో రూపొందుతున్న బుట్ట బొమ్మ రీమేక్ మూవీతో అర్జున్ దాస్ తెలుగులో అడుగు పెడుతున్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఐశ్వర్య లక్ష్మి మీకు ప్రేమ పెళ్లి ఇష్టమా లేక పెద్దలు గురించిన పెళ్లి ఇష్టమా అని ప్రశ్నిస్తే తనకు అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని వెల్లడించి షాక్ ఇచ్చింది. అలా మాట్లాడిన ఐశ్వర్య నెలరోజులు తిరగకుండానే ఇలా అర్జున్ దాస్ తో ఫోటోని షేర్ చేయడం, దానికి లవ్ సింబల్ ని క్యాప్షన్ గా పెట్టడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది..!