High Court lawyers విధాత: చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ తదనంతర పరిణామాలు టిడిపి క్యాంప్ ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. చంద్రబాబు ఎప్పుడూ ఎక్కడా అవినీతికి పాల్పడలేదని చెప్పడానికి దాని అనుకూల మీడియా బాగా ప్రయాస పడుతోంది. రకరకాల వాదనలు, వెర్షన్లు .. ఇవన్నీ బయటికి తీసుకొస్తూ చంద్రబాబు నిష్కళంక రాజకీయ నాయకుడు అని చెబుతూ వస్తున్నారు. అటునుంచి వైసిపి క్యాంప్ కూడా సోషల్ మీడియా, చానెళ్లు, పత్రిక ద్వారా అదే స్థాయిలో దూకుడుగా వెళుతూ చంద్రబాబును […]

High Court lawyers
విధాత: చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ తదనంతర పరిణామాలు టిడిపి క్యాంప్ ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. చంద్రబాబు ఎప్పుడూ ఎక్కడా అవినీతికి పాల్పడలేదని చెప్పడానికి దాని అనుకూల మీడియా బాగా ప్రయాస పడుతోంది. రకరకాల వాదనలు, వెర్షన్లు .. ఇవన్నీ బయటికి తీసుకొస్తూ చంద్రబాబు నిష్కళంక రాజకీయ నాయకుడు అని చెబుతూ వస్తున్నారు. అటునుంచి వైసిపి క్యాంప్ కూడా సోషల్ మీడియా, చానెళ్లు, పత్రిక ద్వారా అదే స్థాయిలో దూకుడుగా వెళుతూ చంద్రబాబును ఫిక్స్ చేస్తోంది.
ఇక టిడిపి వాళ్ళు అయితే ఐటి సృష్టికర్త చంద్రబాబు మీద తప్పుడు కేసులు పెడతారా అంటూ హైదరాబాద్, బెంగళూరులో సైతం ధర్నాలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా టిడిపి తరపున టివి చర్చల్లో పాల్గొంటున్న కొందరు సంయమనం కోల్పోయి మాట్లాడి వ్యవస్థలకు దొరికిపోతున్నారు. అమరావతి జేఏసీ చైర్మన్ గా ఉన్న కొలికపూడి శ్రీనివాస్ ఛానెల్ చర్చలో మాట్లాడుతూ సీఐడీ కేసులు వాదిస్తున్న అదనపు అడ్వకెట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని చెప్పు తెగేవరకూ కొడతాను అని అన్నారు.
ఇది ఇప్పుడు వైరల్ ఐంది. న్యాయ వ్యవస్థను అవమానించడం,, బెదిరించడం వంటి దారుణాలకు తెగబడిన శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోవాలని హై కోర్టు న్యాయవాదులు ప్రభుత్వాన్ని, డిజిపిని కోరుతూ ఒక ఫిర్యాదు చేసారు. దీంతోబాటు సదరు శ్రీనివాస్ కు నోటీసులు కూడా పంపించారు. దీంతోబాటు ఆ కేసులో చంద్రబాబును రిమాండ్ కు పంపిన న్యాయమూర్తి మీద కూడా పరుష పదజాలంతో కొందరు కామెంట్లు చేయడం గమనార్హం.
