High Court | హైద‌రాబాద్‌, విధాత : కొత్త మెడిక‌ల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపుపై తెలంగాణ విద్యార్థుల‌కు ఊర‌ట ల‌భించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల‌లో జాతీయ కోటా పోను మిగిలిన 85% సీట్లను తెలంగాణ విద్యార్థుల‌కు కేటాయించ‌డాన్ని రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. కాంపిటిటివ్‌ అథారిటీ కోటాలోని 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న జీవో 72 జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ జీవోలో ఆల్ ఇండియా కోటాలో […]

High Court |

హైద‌రాబాద్‌, విధాత : కొత్త మెడిక‌ల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపుపై తెలంగాణ విద్యార్థుల‌కు ఊర‌ట ల‌భించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల‌లో జాతీయ కోటా పోను మిగిలిన 85% సీట్లను తెలంగాణ విద్యార్థుల‌కు కేటాయించ‌డాన్ని రాష్ట్ర హైకోర్టు సమర్థించింది.

కాంపిటిటివ్‌ అథారిటీ కోటాలోని 100% సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న జీవో 72 జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ జీవోలో ఆల్ ఇండియా కోటాలో 15 శాతం పోగా మిగిలినవన్నీ తెలంగాణ వారికే దక్కుతాయని పేర్కొంది.

దీనిపై ఏపీ విద్యార్థులు కొంత‌మంది తెలంగాణ‌లోని మెడిక‌ల్ కాజీజీల్లో త‌మ‌కు రిజ‌ర్వేష‌న్ కావాల‌ని హైకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అలోక్ అరాధే, జ‌స్టిస్ శ్ర‌వ‌ణ్‌కుమార్ ధ‌ర్మాస‌నం సోమవారం విచార‌ణ చేప‌ట్టింది. తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వ జీవోను స‌మ‌ర్ధించింది. ఏపీ విద్యార్థులు వేసిన పిటిష‌న్‌ను ధ‌ర్మాస‌నం కొట్టివేస్తూ తీర్పు వెల్ల‌డించింది.

Updated On 12 Sep 2023 5:59 AM GMT
krs

krs

Next Story