విదాత‌, హైద‌రాబాద్: ​రాష్ట్రంలో పోడు భూములపై జిల్లా సమన్వయ కమిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో 140పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను శంకర్‌నాయక్, అంజీ, మీక్యా నాయక్ దాఖలు చేశారు. ఆ జీవోలో ఎమ్మెల్యే, ఎంపీలు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలతో కమిటీ ఏర్పాటు చేశారని అది చట్ట విరుద్ధమని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. అలాగే పోడు భూములపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది ఇరువైపులా వాదనలు […]

విదాత‌, హైద‌రాబాద్: ​రాష్ట్రంలో పోడు భూములపై జిల్లా సమన్వయ కమిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో 140పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను శంకర్‌నాయక్, అంజీ, మీక్యా నాయక్ దాఖలు చేశారు.

ఆ జీవోలో ఎమ్మెల్యే, ఎంపీలు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలతో కమిటీ ఏర్పాటు చేశారని అది చట్ట విరుద్ధమని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. అలాగే పోడు భూములపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది

ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కమిటీ ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 140 చట్ట పరిధిలో లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని న్యాయస్థానం పేర్కొంటూ.. తదుపరి విచారణ అక్టోబర్ 21కి వాయిదా వేసింది.

Updated On 23 Sep 2022 11:52 AM GMT
Somu

Somu

Next Story