Saturday, April 1, 2023
More
    HomelatestHigh Court: పోడు భూముల క్రమబద్దీకరణలో నిబందనలు పాటించాలి.. హైకోర్టు ఆదేశం

    High Court: పోడు భూముల క్రమబద్దీకరణలో నిబందనలు పాటించాలి.. హైకోర్టు ఆదేశం

    • పట్టాల పంపిణీపై స్టే నిరాకరణ.. జూన్‌22కు కేసు వాయిదా

    విధాత: పోడు భూముల క్రమబద్దీకరణలో చట్టాన్ని, నిబంధనలను పాటించాలని రాష్ట్ర‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది(High Court order). పోడు భూములకు పట్టాలు ఇవ్వడాన్ని నిలిపి వేయాలంటూ ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పద్మనాభరెడ్డి(Padmanabha Reddy) వేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేసింది. ఈ సందర్భంగా పిటీషనర్‌ పోడుభూములకు పట్టాలివ్వడం చట్టవిరుద్దమని హైకోర్టులో వాదించారు.

    అటవీ హక్కుల చట్టం, నిబంధనలు, సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్దంగా ప్రభుత్వం ఇచ్చిన మెమో ఉందని పిటీషనర్‌ వాదించారు. అయితే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటే న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యాడు. కేసు వాదనలు విన్న హైకోర్టు పోడు భూములకు పట్టాల పంపిణీపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు జూన్‌22వ తేదీకి వాయిదా వేసింది.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular