Telangana | తెలంగాణ ఉన్నత విద్యాశాఖలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 3,897 మంది ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హరీశ్‌రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభోత్సవం రోజున కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించే దస్త్రంపై కేసీఆర్ సంతకం చేసిన విషయం తెలిసిందే.
విద్యాశాఖలోని వివిధ విభాగాల్లో ఉన్న 3897 కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. pic.twitter.com/Aa2qadYxHa
— Harish Rao Thanneeru (@BRSHarish) May 2, 2023
ఉన్నత విద్యాశాఖలో క్రమబద్దీకరించిన ఉద్యోగాలు ఇవే..
కమిషనర్ ఆఫ్ కాలేజీయట్ ఎడ్యుకేషన్
లెక్చరర్స్(మినిమమ్ టైమ్ స్కేల్) -10
లెక్చరర్స్(డిగ్రీ ) – 270
కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
జూనియర్ లెక్చరర్స్ – 2909
జూనియర్ లెక్చరర్స్(ఒకేషనల్ ) – 184
సీనియర్ ఇన్‌స్ట్రక్టర్(ఒకేషనల్ ) – 03
కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్
పాలిటెక్నిక్ లెక్చరర్ – 390
వర్క్‌షాప్ అటెండర్స్ ల్యాబ్ అటెండెంట్ – 131