విధాత: ఉత్తరప్రదేశ్ జాన్ పూర్‌కి చెందిన హిమాన్షు తివారి ను భారత రాష్ట్ర సమితి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు బీఆర్ఎస్ వ్యవస్థాపకులు, సీఎం కేసీఆర్ ప్రకటించారు. తివారి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమించారు.
బిహార్ చంపారన్ నుంచి ఉత్తరప్రదేశ్ బనారస్ వరకు 21 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి రైతుల మద్ధతును కూడగట్టారు. జన జాగారన్ యాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో రైతు ఉద్యమకారులను, సంఘాలను సమన్వయం చేయడంలో విశేషమైన కృషి చేశారు. ఇక నుంచి బిఆర్ఎస్ లో హిమాన్షు తివారి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.