Himayat Sagar | రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. హిమాయత్ సాగర్ రెండు గేట్లను జలమండలి అధికారులు ఎత్తివేశారు. ప్రస్తుతం సాగర్‌లోకి 1200 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1373 క్యూసెక్కుల నీరు మూసీలోకి వెళ్తున్నది. […]

Himayat Sagar |
రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ఈ రెండు ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
హిమాయత్ సాగర్ రెండు గేట్లను జలమండలి అధికారులు ఎత్తివేశారు. ప్రస్తుతం సాగర్‌లోకి 1200 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1373 క్యూసెక్కుల నీరు మూసీలోకి వెళ్తున్నది. సాగర్‌లో ఇప్పుడు 1763.20 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది.
పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు. వర్షం ఇలాగే కురుస్తుండటంతో హిమాయత్ సాగర్ మరో రెండు గేట్లను ఎత్తివేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తి మూసీలోకి 442 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. అత్యవసర సాయం కోసం జీహెచ్ఎంసీ హెల్ఫలైన్ నంబర్ 040-2111 1111, డయల్ 100, ఈవీడీఎం కంట్రోల్ రూం నంబర్ 90001 13667 నంబర్లను సంప్రదించాలన్నారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు.
