Hollywood Beach shooting | విధాత: ఫ్లోరిడాలోని హాలీవుడ్ బీచ్‌ ప్రాంతంలో సోమ‌వారం సాయంత్రం క‌ల‌క‌లం రేగింది. దుండ‌గులు కొంద‌రు తుపాకీల‌తో విచ్చ‌ల‌విడిగా కాల్పులు జ‌ర‌ప‌డంతో 9 మంది గాయాలపాల‌య్యారు. వారిని పోలీసులు ద‌గ్గ‌ర్లోని చిల్డ్ర‌న్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గాయ‌ప‌డిన వారిలో ముగ్గురు చిన్నారులున్న‌ట్లు తెలుస్తోంది. 9 wounded, including 4 kids between ages 1 and 17, in Hollywood Beach, Florida shooting as hundreds ran for cover at 7pm […]

Hollywood Beach shooting |

విధాత: ఫ్లోరిడాలోని హాలీవుడ్ బీచ్‌ ప్రాంతంలో సోమ‌వారం సాయంత్రం క‌ల‌క‌లం రేగింది. దుండ‌గులు కొంద‌రు తుపాకీల‌తో విచ్చ‌ల‌విడిగా కాల్పులు జ‌ర‌ప‌డంతో 9 మంది గాయాలపాల‌య్యారు. వారిని పోలీసులు ద‌గ్గ‌ర్లోని చిల్డ్ర‌న్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గాయ‌ప‌డిన వారిలో ముగ్గురు చిన్నారులున్న‌ట్లు తెలుస్తోంది.


రెండు గ్రూపుల మ‌ధ్య మొద‌లైన గొడ‌వే కాల్పుల‌కు దారితీసిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికంగా మెమోరియ‌ల్ సెల‌వుదినం కావ‌డంతో సుమారు 50 కి.మీ. పొడ‌వైన ఫ్లోరిడా బీచ్ సంద‌ర్శ‌కుల‌తో సంద‌డిగా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో కాల్పులు చోటు చేసుకోవ‌డం వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, వైద్య సిబ్బంది పెద్ద సంఖ్య‌లో వ‌చ్చి స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాలుపంచుకున్నారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మ‌ర గాలింపు చేప‌డుతున్నారు.

Updated On 30 May 2023 5:52 AM GMT
krs

krs

Next Story