Honey-trapped |
- మొన్న DRDO శాస్త్రవేత్త కురుల్కర్
- నేడు IAF అధికారి నిఖిల్ షిండే
విధాత: హనీట్రాప్ (Honey-trapped)తో దేశ రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేస్తూ ఇటీవల DRDO శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ కురుల్కర్ పట్టుబడితే.. తాజాగా నిఖిల్ షిండే అనే IAF అధికారి సైతం అదే పద్ధతిలో హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. ప్రస్తుతం ఆయనను బెంగళూరులో ఎయిర్‌ఫోర్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మహారాష్ట్ర యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు నిఖిల్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడని సమాచారం. దానిని అధికారులు శివాజీనగర్ కోర్టులోని ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట సమర్పించినట్టు ఏటీఎస్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుజాత తన్వాడే స్పెషల్ కోర్టుకు తెలిపారు.
హనీట్రాప్ ద్వారా నిఖిల్‌షిండేను సంప్రదించిన పాకిస్థానీ గూఢచార సంస్థలు.. ఆయన నుంచి రక్షణశాఖ రహస్యాలను సేకరించేందుకు ప్రయత్నించారని కోర్టుకు ఏటీఎస్ తెలిపింది. అయితే ఈ కేసులో ఆయనను ఇంకా నిందితుడిగా చేర్చలేదు. కురుల్కర్‌తో పాటు షిండేకు వచ్చిన సందేశాలు పాకిస్తానీ ఐపీ అడ్రస్ నుంచి వచ్చినట్టు గుర్తించారు.