విధాత: ప్ర‌ముఖ వ్య‌క్తుల‌ను వ‌ల‌లో వేసుకునేందుకు కొంత‌మంది మ‌హిళ‌లు హానీ ట్రాప్‌కు పాల్ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఇలాంటి కేసులు అధిక‌మ‌య్యాయి. ఇలాంటి ఘ‌ట‌నే ఓ బీజేపీ ఎమ్మెల్యేకు ఎదురైంది. ఓ మ‌హిళ స‌ద‌రు ఎమ్మెల్యే వాట్సాప్ వీడియో కాల్ చేసి త‌న ప్రైవేటు భాగాల‌ను చూపించే ప్ర‌య‌త్నం చేసింది. అప్ర‌మ‌త్త‌మైన ఎమ్మెల్యే క్ష‌ణాల్లోనే కాల్‌ను క‌ట్ చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క‌లోని చిత్ర‌దుర్గ బీజేపీ ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డి(75)కి అక్టోబ‌ర్ 31వ తేదీన ఓ కాల్ […]

విధాత: ప్ర‌ముఖ వ్య‌క్తుల‌ను వ‌ల‌లో వేసుకునేందుకు కొంత‌మంది మ‌హిళ‌లు హానీ ట్రాప్‌కు పాల్ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఇలాంటి కేసులు అధిక‌మ‌య్యాయి. ఇలాంటి ఘ‌ట‌నే ఓ బీజేపీ ఎమ్మెల్యేకు ఎదురైంది. ఓ మ‌హిళ స‌ద‌రు ఎమ్మెల్యే వాట్సాప్ వీడియో కాల్ చేసి త‌న ప్రైవేటు భాగాల‌ను చూపించే ప్ర‌య‌త్నం చేసింది. అప్ర‌మ‌త్త‌మైన ఎమ్మెల్యే క్ష‌ణాల్లోనే కాల్‌ను క‌ట్ చేశారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క‌లోని చిత్ర‌దుర్గ బీజేపీ ఎమ్మెల్యే జీహెచ్ తిప్పారెడ్డి(75)కి అక్టోబ‌ర్ 31వ తేదీన ఓ కాల్ వ‌చ్చింది. అస‌భ్య‌క‌రంగా మాట్లాడేస‌రికి ఎమ్మెల్యే అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేదు. దీంతో కాల్‌ను క‌ట్ చేశారు ఎమ్మెల్యే. క్ష‌ణాల్లోనే మ‌ళ్లీ వాట్సాప్ వీడియో కాల్ వ‌చ్చింది. ఇక మ‌హిళ న‌గ్నంగా క‌నిపించింది. త‌న ప్రైవేటు భాగాల‌ను చూసిస్తూ ఎమ్మెల్యేను టెంప్ట్ చేసే ప్ర‌య‌త్నం చేసింది.

అప్ర‌మ‌త్త‌మైన ఎమ్మెల్యే వాట్సాప్ కాల్‌ను క‌ట్ చేశారు. మ‌ళ్లీ అర నిమిషానికే వీడియో కాల్ రావ‌డంతో ఈ సారి త‌న భార్య‌కు ఫోన్ ఇచ్చారు. ఆమె కాల్ క‌ట్ చేసి, ఆ నంబ‌ర్‌ను బ్లాక్ లిస్ట్‌లో ఉంచింది. ఈ ఘ‌ట‌న‌పై ఎమ్మెల్యే తిప్పారెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Updated On 3 Nov 2022 12:17 PM GMT
krs

krs

Next Story