మేషం : ఈ రాశివారికి రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.
వృషభం : ఈ రాశివారు అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు.
మిథునం : ఈ రాశివారు పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.
కర్కాటకం : ఈ రాశివారికి ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
సింహం : ఈ రాశివారు మోసపోయే అవకాశాలు ఉంటాయి. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కన్య : ఈ రాశివారికి అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్నిపనులు చెడిపోతాయి.
తుల : ఈ రాశివారు అనారోగ్య బాధలతో సతమతమవుతారు. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు.
వృశ్చికం : ఈ రాశివారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు.
ధనుస్సు : ఈ రాశివారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు.
మకరం : ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు.
కుంభం : ఈ రాశివారికి పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
మీనం : ఈ రాశివారు ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి.రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.