Tuesday, January 31, 2023
More
    Homelatestశుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఓర్పు చాలా అవసరం..!

    శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఓర్పు చాలా అవసరం..!

    మేషం : ఈ రాశివారికి వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత కలదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలతో విజయం వరిస్తుంది.

    వృషభం : ఈ రాశివారికి కొన్ని ప‌నుల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. మనోధైర్యంతో చేసే పనులు నెరవేరుతాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.లక్ష్మీఆరాధన చేయాలి.

    మిథునం : ఈ రాశివారికి ప్రయత్నకార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

    క‌ర్కాట‌కం : ఈ రాశివారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు.

    సింహం : ఈ రాశివారు నేడు ప్రారంభించబోయే పనుల్లో గొప్పఫలితాలు సాధిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

    క‌న్య : ఈ రాశివారికి ఇవాళ‌ శుభకాలం. మనోధైర్యంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అర్ధ,వస్త్ర లాభాలు ఉన్నాయి.

    తుల : ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు.

    వృశ్చికం : ఈ రాశివారికి ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. మీ పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి.

    ధ‌నుస్సు : ఈ రాశివారికి ఇవాళ శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది.

    మ‌క‌రం : ఈ రాశివారికి నేడు మంచి ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా పనిచేయాలి.ఆరోగ్యం సహకరిస్తుంది.శాంతి చేకూరుతుంది.

    కుంభం : ఈ రాశివారు సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తోటివారి సూచనలు ఉపయోగపడతాయి.వివాదాలకు దూరంగా ఉండాలి.

    మీనం : ఈ రాశివారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు.అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular